దర్శకుడు శంకర్​, క్రికెటర్​ సురేశ్​రైనాకు గౌరవ డాక్టరేట్​

author img

By

Published : Aug 6, 2022, 1:49 PM IST

Director Shankar Cricketer Suresh Raina Doctorate

మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్​ఎన్​ రవి వీరిద్దరికీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు.

Director Shankar-Cricketer Suresh Raina Doctorate: చెన్నైలో జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్​ఎన్​ రవి వీరిద్దరికీ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. పల్లవరంలోని వీఈఎల్​ఎస్​ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల 12వ స్నాతకోత్సవంలో విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు అందించారు.

చెన్నై చెస్‌ ఒలంపియాడ్‌లో పాల్గొన్నవారికి ఈ సందర్భంగా సురేశ్‌ రైనా అభినందనలు తెలిపారు. చెన్నైకి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ గౌరవ డాక్టరేట్‌ తనకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని దర్శకుడు శంకర్‌ తెలిపారు. మరిన్ని మంచి సినిమాలు చేయడానికి స్ఫూర్తిని కలిగించిందని చెప్పారు.

ఇదీ చూడండి: బింబిసార- సీతారామం బ్యూటీస్​ హెవీ వర్కౌట్స్​.. చెమటలు పట్టిస్తున్నారుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.