ఓటీటీలోకి ఆస్కార్​ రేస్​ మూవీ 'ఛెల్లో షో'.. ఎప్పుడంటే?

author img

By

Published : Nov 21, 2022, 6:43 PM IST

Oscar Chello ott release

తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథగా తెరకెక్కిన చిత్రం 'ఛెల్లో షో'. సినీ ప్రియుల హృదయాల్ని హత్తుకున్న ఈ సినిమా ఆస్కార్​ బరిలో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.

'ఛెల్లో షో'.. దర్శకుడు నలిన్‌ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్‌- 2023లో పోటీపడే అవకాశం దక్కించుకుంది. 'లాస్ట్‌ ఫిల్మ్‌ షో' (ఆంగ్లంలో) అనే ఈ గుజరాతీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నవంబర్‌ 25 నుంచి ఈ సినిమా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నలిన్‌ మాట్లాడుతూ ''లాస్ట్‌ ఫిల్మ్‌ షో అనేది సినిమా కాదు.. ఒక వేడుక ఇప్పుడు ఈ వేడుకను భారతదేశంలోని ప్రజలందరూ చేసుకోనున్నారు'' అంటూ నెట్‌ఫ్లిక్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. 'ఈ సినిమా ఎక్కువ మంది వ్యక్తులకు చేరువవ్వాలని నేను కలలకంటున్నాను. లాస్ట్‌ ఫిల్మ్‌ షో కేవలం ఒక క్లిక్‌ దూరంలో ఉంది' అని నిర్మాత అన్నారు.

ఇదీ కథ..: 'బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌' కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపికైన ఈ సినిమా దర్శకుడు నలిన్‌ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కింది. చిన్న తనంలో ఆయన సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? వెండితెర, సినిమా పై ఎంత మమకారం పెంచుకున్నారు? తదితర హృదయాలను హత్తుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. గుజరాత్‌ రాష్ట్రంలోని గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో ఈ సినిమా ద్వారా నలిన్‌ కళ్లకు కట్టినట్టు చూపించారు. తొమ్మిదేళ్ల బాలుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్‌ రాబరి, భవేశ్‌ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్‌ రావల్‌, పరేశ్‌ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. 'లాస్ట్‌ ఫిల్మ్‌ షో' (ఆంగ్లంలో) పేరుతో ఈ సినిమా గతేడాది జూన్‌లో 'ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌'లో ప్రదర్శితమై, వీక్షకుల హృదయాల్ని బరువెక్కించింది. పలు అంతర్జాతీయ వేడుకల్లోనూ సత్తా చాటింది.

ఇదీ చూడండి: హనుమాన్​ టీజర్​తో సోషల్​మీడియా షేక్​ ​​​ విజువల్ వండర్స్ స్టిల్స్ చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.