లండన్​ స్ట్రిప్​ క్లబ్​కు కేఎల్​ రాహుల్​ వెళ్లాడా?.. అతియా క్లారిటీ ఇదిగో!

author img

By

Published : May 28, 2023, 7:29 AM IST

Updated : May 28, 2023, 12:43 PM IST

athiya shetty clarifies about teamindia cricketer  kl rahul visiting  strip club in london

లండన్‌లోని ఓ స్ట్రిప్ క్లబ్​లో కేఎల్​ రాహుల్​ ఉన్నట్లుగా కనిపించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు అతన్ని విపరీతంగా ట్రోల్​ చేయడం ప్రారంభించారు. అయితే ఈ విషయం పై రాహుల్​ సతీమణి అతియా శెట్టి స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నందంటే ?

KL Rahul strip video : గాయం కారణంగా ఐపీఎల్​కు దూరమైన లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ టీమ్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్ శస్త్ర చికిత్స కోసం లండన్​కు వెళ్లాడు. ఆపరేషన్ అయ్యాక అక్కడే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొద్ది కొద్దిగా రికవర్ అవుతున్న అతను తన సతీమణి అతియా శెట్టితో పాటు ఫ్రెండ్స్​తో లండన్​ వీధుల్లో విహరిస్తూ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే వీరందరూ కలిసి ఓ స్ట్రిప్​ క్లబ్​కు వెళ్లారు. అక్కడ రాహుల్ ఆడి పాడుతూ కనిపించాడు. ఆ వీడియో కాస్త సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు అతన్ని విపరీతంగా ట్రోల్​ చేయడం ప్రారంభించారు. 'సర్జరీకి వెళ్లి నువ్వు చేస్తున్న పనులు ఇవా' అంటూ చీవాట్లు పెడుతున్నారు. దీంతో ఆగ్రహించిన రాహుల్​ సతీమణి అతియా శెట్టి.. ఇన్​స్టా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

Athiya Shetty Insta Post : "నేను సాధారణంగా ఎటువంటి విషయం పైన రియాక్ట్​ అవ్వకుండా మౌనంగా ఉంటాను. కానీ కొన్నిసార్లు మనకోసం మనం నిలబడటం చాలా ముఖ్యం. అందరిలాగే నేను, రాహుల్, మా స్నేహితులు.. ఓ సాధారణ ప్రదేశానికి వెళ్ళాము. సందర్భానుసారంగా విషయాలను తీసుకోవడం మానేసి, ఏదైనా అనే ముందు ఒకసారి వాస్తవాలను తెలుసుకోండి."

అయితే ఈ విషయంపై కే ఎల్​ రాహుల్​ ఎటువంటి రియాక్షన్​ ఇవ్వలేదు. కాగా గతంలో రాహుల్​.. తన శస్త్రచికిత్స గురించి ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా అప్‌డేట్ ఇచ్చాడు. అభిమానులకు కృతజ్ఞత తెలిపాడు. "నా ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది. నేను కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకుంటున్న డాక్టర్లు, మెడికల్ స్టాఫ్‌కి ధన్యవాదాలు. ఇప్పుడు నేను కోలుకుంటున్నాను. మళ్లీ మైదానంలోకి దిగి, నా బెస్ట్‌ను ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉన్నాను" అని అన్నాడు.

Athiya Shetty Insta Post
అతియా శెట్టి ఇన్​స్టా పోస్ట్​

ఇక రాహుల్​ కెరీర్​ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ జట్టుకు సారధిగా వ్యవహరించిన జరిగిన అన్నీ మ్యాచ్​ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే లఖ్​నవూ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​లో.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను గాయపడ్డాడు. దీంతో నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డి అక్కడే పడిపోయాడు. అయితే ఆ మ్యాచ్‌లో మళ్లీ ఫీల్డింగ్ చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చివరి వికెట్​కు బ్యాటింగ్‌కు దిగాడు. అప్పుడు కూడా నొప్పి కారణంగా అంతగా ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో లఖ్​నవూ సూపర్ జెయిట్స్ ఓటమి పాలైంది. డాక్టర్ల సూచన మేరకు రెస్ట్​ తీసుకుంటున్న రాహుల్​.. మ్యాచ్​లో జరిగిన గాయం వల్ల లీగ్​కు దూరమయ్యాడు.

Last Updated :May 28, 2023, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.