అల్లు అర్జున్​తో అట్లీ క్రేజీ కాంబినేషన్​.. రూ.100 కోట్లు రెమ్యూనరేషన్!

author img

By

Published : Sep 27, 2022, 12:07 PM IST

atlee kumar and allu arjun

Atlee Allu Arjun Movie : 'పుష్ప' బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో పాన్​ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్​ పెరిగిపోయింది. బన్నీతో సినిమా చేయడానికి నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇలాంటి సమయంలో కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే..

Atlee Allu Arjun Movie : 'పుష్ప : ది రైజ్​'.. సినిమా దేశవ్యాప్తంగా దుమ్మురేపింది. ఎవరి నోట్లో చూసినా అదే డైలాగ్​.. 'తగ్గేదే లే'. ఫ్యాన్స్​ కావచ్చు.. రాజకీయ నాయకులు కావచ్చు.. క్రీడాకారులు కావచ్చు.. అందరూ డైలాగ్ చెప్పడం, మ్యానరిజం చూపించడం. దేశంలోనే కాదు.. విదేశాల్లో 'పుష్ప' మేనియా కొన్ని రోజులు కొనసాగింది. దీంతో అల్లు అర్జున్​కు​ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగిపోయింది.

ఎంతగా అంటే ఫ్యాన్స్​ రిక్వెస్ట్ చేసి మరీ మళ్లీ స్పెషల్ షోలు వేస్తున్నారట. ఇదే కాదు అల్లు అర్జున్ నటించిన ఓ యాడ్​కు​ యూట్యూబ్​లో ఏకంగా 0.95 మిలియన్​ లైక్స్​ వచ్చాయి. అమెజాన్​ ప్రైమ్​లో 2022లో ఎక్కువ మంచి చూసిన సినిమాగా పుష్ప నిలిచింది. దీంతో ఈ అల్లు వారి పిల్లాడి సినిమా కోసం ఫ్యాన్స్​ తెగ ఎదురు చూస్తున్నారు. సుకుమార్​ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

అయితే అల్లు అర్జున్​ నుంచి మరో మూవీ అప్డేట్​ రాబోతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుమార్.. అల్లు అర్జున్​తో ఓ సినిమా చేయబోతున్నాడట. దీనికి అల్లు అర్జున్​కు రూ. 100 కోట్ల పారితోషకం ఇవ్వబోతున్నారట. 'కత్తి', '2.0' సినిమాలను నిర్మించిన సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

హాలీవుడ్ భారీ హిట్​ సాధించిన నెట్​ఫ్లిక్స్​ వెబ్​ సిరీస్ 'మనీహైస్ట్​' స్టోరీ లైన్​కు ఈ కథ దగ్గరగా ఉంటుందని సమాచారం. అట్లీ కథ చెప్పారని.. బన్నీ సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తోంది. పుష్ప-2 షూటింగ్ ముగిశాక.. బన్నీ, అట్లీ సినిమా లుక్​ టెస్టులో పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఇటీవలే 'అల్లూరి' సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో సందడి చేశారు అల్లు అర్జున్​. తన యాక్టింగ్​తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బన్నీ తెలుగులో చాలా మంది సంపాదించుకున్నారు. ఇక్కడే కాదు కేరళలోనూ ఆయన్ను ముద్దుగా మల్లు అర్జున్ అని​ పిలుచుకుంటారు. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం చేయడంలోనూ ముందుంటారు ఈ ఐకాన్​ స్టార్.

ఇవీ చదవండి : అక్టోబర్​లో 'ఆదిపురుష్'​ భారీ అప్డేట్​.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే!

అక్టోబర్​లో క్రేజీ కాంబినేషన్స్​.. పండుగ టైంలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.