ఒక్కటైన రాహుల్​-అతియా.. అఫీషియల్​గా మామ అయ్యానన్న సునీల్​ శెట్టి..

author img

By

Published : Jan 23, 2023, 7:03 PM IST

Athiya Shetty and KL Rahul tie knot in Khandala said by sunil shetty

ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, నటి అతియా శెట్టి వివాహబంధంలోకి అడుగుపెట్టేశారు. ఈ విషయాన్ని అతియా తండ్రి సునీల్​ శెట్టి అధికారికంగా తెలిపారు.

భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌.. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె, నటి అతియాశెట్టి మెడలో మూడుముళ్లు వేశాడు. మహారాష్ట్ర, ఖండాలలోని సునీల్‌శెట్టికి చెందిన ఫామ్‌హౌస్‌లో సోమవారం సాయంత్రం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని అతియా తండ్రి సునీల్​ శెట్టి అధికారికంగా ధ్రువీకరించారు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం వంద మంది అతిథులను మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

అయితే రాహుల్​- అతియా వివాహం జరిగిన అనంతరం.. సునీల్​ శెట్టి మీడియాతో మట్లాడారు. "రాహుల్​- అతియా వివాహం జరిగిపోయింది. నేను అధికారంగా మామను అయ్యాను" అని తెలిపారు. ఆ సమయంలో సునీల్​ శెట్టి, ఆయన కుమారుడు అహాన్​ శెట్టి.. సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. అయితే సునీల్ శెట్టి ఫామ్​హౌన్.. అతిథులతో కళకళాలాడుతున్నట్లు తెలుస్తోంది.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.