వెండితెరపై 'కరోనా లాక్​డౌన్​' కష్టాలు.. 'భీడ్​'​ ట్రైలర్ చూశారా?​

author img

By

Published : Mar 10, 2023, 1:22 PM IST

bheed trailer

2020లో వలసదారుల కష్టాలను వెండితెరపై చూపించేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్​ దర్శకుడు అనుభవ్​ సిన్హా. 'భీడ్​'​ అనే సినిమాను తెరకెక్కించారు. మార్చి 24న విడుదలవ్వనున్న ఈ సినిమా ట్రైలర్​.. చూసిన వారందరికీ లాక్​డౌన్​ పరిస్థితుల్ని గుర్తుకు తెస్తోంది. అయితే ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే..

2020లో దేశమే కాదు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. దీనికి కారణం చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కొవిడ్​ అనే ఒక మహమ్మారి. అది అక్కడి నుంచి వచ్చి ఇక్కడున్న ఎంతో మంది ప్రాణాలను కబళించింది. ఓ చిన్న వైరస్​ అందరిని పొట్టనబెట్టుకోవడమే కాకుండా ఎంతో మందిని రోడ్డుకు ఈడ్చింది. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలిమేరలు దాటేలా చేసింది.

దేశమంతటా కొవిడ్​ మహమ్మారి ప్రబలుతున్న వేళ భారత్​తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సంపూర్ణ లాక్​డౌన్​ను అమలు చేశాయి. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని అత్యవసర సమయాల్లో తప్ప బయటకు అస్సలు రాకూదటంటూ కఠిన నిబంధనలు విధించాయి. ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అయినప్పటికీ ఉద్యోగరీత్యా సుదూర ప్రాంతాలకు వచ్చిన ప్రజలకు ఈ నిబంధన తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇక వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతం. లాక్​డౌన్​ వల్ల పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయి.. వారి ఉద్యోగాలు పోయాయి. తీరా ఇక్కడే ఉండిపోదామంటే తమ వద్దనున్న డబ్బులతో ఇంటిని నెట్టుకు రాలేని పరిస్థితి. దీంతో వీలైనంత త్వరగా తమ ఇంటికి చేరుకోవాలకున్న వారికి నిరాశే ఎదురయ్యింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దాంతో పొట్ట కూటి కోసం వచ్చిన వారికి తమ సొంత గూటికి చేరుకోనే మార్గం కనపడకపో ఛిన్నాభిన్నం అయిపోయారు.

అయితే కొంత మంది ఎలాగైనా తమ ఇంటికి చేరుకోవాలన్న దృఢ నిశ్చయంతో కాలి బాటలో పయనమయ్యారు. అయితే దారిలో వారికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సేదతీరుదామంటే సరైన నీడ కూడా ఉండదు. ఆకలి దప్పికలను ఆపుకుంటూ ఎక్కడైనా ఆగితే ఆ ఊరి వారు వీరిని దగ్గరకు చేరదీయలేదు. ఇక కొన్ని ప్రాంతాల పోలీసులు అమానవీయంగా దాడికి పాల్పడిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో వారిని ఆదుకునే నాథుడు లేక తగిలిన గాయాలతోనే ముందుకు సాగేవారు.

ఇలాంటి అమానవీయ ఘటనలు ఇంకెన్నో జరిగాయి. అవన్నీ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. కొంత మంది దీన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తే మరి కొంత మంది టీవీల్లో చూశారు. అయితే నిజజీవితంలో జరిగిన ఆ ఘటనలే ఇప్పుడు వెండితెరపై కనిపించనున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని హిందీ డైరెక్టర్​ అనుభవ్​ సిన్హా 'భీడ్​'​​ అనే సినిమాను తెరకెక్కించారు. మార్చి 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజవ్వనుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేసింది మూవీ టీమ్​. ఈ సినిమా మొత్తాన్ని బ్లాక్​ అండ్​ వైట్​లోనే తెరకెక్కించారు దర్శకుడు అనుభవ్​ సిన్హా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బెనరాస్​ మీడియా వర్క్​ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావుతో పాటు భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు. వీరితో పాటు పంకజ్ కపూర్, అశుతోష్ రాణా, దియా మీర్జా, వీరేంద్ర సక్సేనా, ఆదిత్య శ్రీవాస్తవ్, కృతిక కమ్రా, కరణ్ పండిత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.