స్పెషల్​ షోతో బుల్లితెరపై రోజా రీఎంట్రీ.. ఎందులో అంటే?

author img

By

Published : Sep 17, 2022, 5:14 PM IST

jabardast promo

జబర్దస్త్​కు దూరమైన నటి రోజా మళ్లీ బుల్లితెరపై ఓ స్పెషల్ ఈవెంట్​ ద్వారా సందడి చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. దాన్ని చూసేయండి..

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది సీనియర్​ నటి రోజా. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. అలాగే బుల్లితెర షో అయిన జబర్దస్త్​లోనూ జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకుంది.

అయితే రాజకీయాల్లో మరిన్ని బాధ్యతలు పెరగడం వల్ల ఈ షో నుంచి తప్పుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో రోజాను ఇకపై షోల్లో కనిపించరని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఆమె త్వరలోనే మళ్లీ బుల్లితెరై సందడి చేయనున్నారు.

దసరా స్పెషల్ ఈవెంట్​లో ఆమె కనువిందు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు మేకర్స్​. ఈ ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా, నవ్వులు పూయిస్తూ సాగింది. ఇందులో భాగంగానే రోజాను స్టేజీపై ఘనంగా సన్మానించారు. అయితే రోజా కనిపించేది ఈ ఒక్క ఎపిసోడ్ వరకేనా? ముందు ముందు స్పెషల్ ఈవెంట్స్​లో కనిపించే ఛాన్సుందా అనేది తెలియాల్సి ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విలేకరులపై తమన్నా బౌన్సర్ల దాడి.. ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.