Constable: 'గోడే కదా పగలగొట్టింది.. ప్రాణాలేవీ పోలేదు కదా'.. బాధితులతో సెంట్రీ కానిస్టేబుల్‌

author img

By

Published : May 11, 2022, 9:48 AM IST

Updated : May 12, 2022, 3:23 PM IST

Conistable

Constable: ఏదో పడగొడుతున్నట్లుగా పెద్ద శబ్ధాలు రావడంతో ఆ ప్రాంతంలోని పిల్లి చంద్రశేఖర్‌ దంపతులు ఉలిక్కిపడి లేచారు. బయటకి వచ్చి చూడగా, వారి ఇంటి గోడను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పగలగొడుతున్నారు. దీంతో వారు భయంతో ‘మాకు ప్రాణాహాని ఉంది. ప్రమాదంలో ఉన్నాం. మమ్మల్ని రక్షించండం’టూ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న కంట్రోల్‌ రూం కానిస్టేబుల్‌ బి.గోవింద్‌ సూచనతో ఐదో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కి ఫిర్యాదివ్వడానికి వెళ్లారు. అక్కడున్న సెంట్రీ కానిస్టేబుల్‌తో విషయం చెప్పారు. సెంట్రీ కానిస్టేబుల్‌ ఫిర్యాదిదారుడి పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడటంతో పాటు, అసభ్య పదజాలాన్ని వినియోగించారు. ఈ ఘటన విశాఖ నగరం కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధి ఓల్ట్‌ ఐటీఐ జంక్షన్‌ వద్దనున్న సంకురపేట ప్రాంతంలో జరిగింది.

Constable: విశాఖ నగరం కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధి ఓల్ట్‌ ఐటీఐ జంక్షన్‌ వద్దనున్న సంకురపేట ప్రాంతం.. ఏదో పడగొడుతున్నట్లుగా పెద్ద శబ్ధాలు రావడంతో ఆ ప్రాంతంలోని పిల్లి చంద్రశేఖర్‌ దంపతులు ఉలిక్కిపడి లేచారు. బయటకి వచ్చి చూడగా, వారి ఇంటి గోడను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పగలగొడుతున్నారు. దీంతో వారు భయంతో ‘మాకు ప్రాణాహాని ఉంది. ప్రమాదంలో ఉన్నాం. మమ్మల్ని రక్షించండం’టూ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న కంట్రోల్‌ రూం కానిస్టేబుల్‌ బి.గోవింద్‌ సూచనతో ఐదో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కి ఫిర్యాదివ్వడానికి వెళ్లారు. అక్కడున్న సెంట్రీ కానిస్టేబుల్‌తో విషయం చెప్పారు. ఆయన ఉదయం రావాలని అనడంతో బాధితులు అక్కడ్నుంచే మళ్లీ కంట్రోల్‌రూంకి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. దీంతో కానిస్టేబుల్‌ గోవింద్‌ బాధితుడి ఫోన్‌లోనే సెంట్రీ కానిస్టేబుల్‌తో మాట్లాడారు.

సెంట్రీ కానిస్టేబుల్‌ ఫిర్యాదిదారుడి పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడటంతో పాటు, అసభ్య పదజాలాన్ని వినియోగించారు. గోడే కదా పగలగొట్టింది... ప్రాణాలేవీ పోలేదు కదా.. రాత్రుళ్లు పోలీసుల్ని విసిగించొద్దు... ఇలా అవమానకర రీతిలో మాట్లాడటంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వీరి మధ్య సాగిన సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో నగర పోలీస్‌ కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌ స్పందించారు. బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరించి దుర్భాషలాడిన ఘటనను తీవ్రంగా పరిగణించారు. సంబంధిత హెడ్‌ కానిస్టేబుల్‌ నెంబరు 1145 బి.గోవింద్‌ను కంట్రోల్‌ రూమ్‌ విధుల నుంచి తప్పించారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే హెడ్‌కానిస్టేబుల్‌ను ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఛార్జిమెమో జారీ చేశామని తెలిపారు.

ఈ ఘటనపై విచారణ జరిపి హెడ్‌ కానిస్టేబుల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించే ప్రజలు, ఫిర్యాదిదారుల పట్ల మర్యాదతో నడుచుకోవాలని సూచించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి వారికి న్యాయం చేయాలని కంచరపాలెం సీఐ కృష్ణారావును సీపీ ఆదేశించారు.

కోర్టు సూచనల మేరకు... ఈ ఘటనపై చంద్రశేఖర్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదును కంచరపాలెం పోలీసులు తీసుకొని ఆమెకు రసీదు ఇచ్చారు. అయితే ఇది సివిల్‌ వ్యవహారం కావడంతో (కేసు కట్టదగనిది కాకపోవడం) పోలీసులు కేసు నమోదు చేయకుండా, దీనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు సూచించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానం సూచించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గోడ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి: తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై స్తంభించిన రాకపోకలు.. వాహనాల దారి మళ్లింపు

Last Updated :May 12, 2022, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.