వైకాపా నాయకుల వేధింపులతో.. తల్లీ, కుమారుడు ఆత్మహత్యాయత్నం..ఆపై తల్లి మృతి

author img

By

Published : Nov 19, 2022, 4:54 PM IST

Mother and son attempted suicide

Suicide attempt in Bikavulu: వైసీపీ నాయకుల వేధింపులతో చనిపోతున్నామంటూ తూర్పుగోదావరి జిల్లాలో సెల్పీ వీడీయో తీసుకుని పురుగుల మందు తాగిన తల్లీ, కుమారుడి కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వీడియోలో స్పష్టంగా నలుగురు పేర్లు చెప్పినా పోలీసులు కనీసం విచారించలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా గ్రామంలో దర్జాగా తిరుగుతున్నారని మండిపడ్డారు. తల్లీ కొడుకులు ఆత్మహత్యకు పాల్పడేలా కొందరు ప్రేరేపించారని.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

వైకాపా నాయకుల వేధింపులతో తల్లీ, కుమారుడు ఆత్మహత్యాయత్నం

Suicide Attempt in Bikavulu: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం మామిడితోటలో వైసీపీ నాయకుల వేధింపులతో తల్లీ, కుమారుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా.. తల్లి కామాక్షి మృతి చెందింది. చనిపోయే ముందు వారు సెల్ఫీవీడియోలో నలుగురు వైసీపీ నాయకుల వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు చెప్పినా.. ఇప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కనీసం వారిని విచారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మామిడితోటలో రోడ్డు పక్కన ఉన్న రెండు సెంట్ల ఆక్రమిత స్థలంలో సుమారు 40 ఏళ్లుగా మీనాక్షి కుటుంబం నివాసం ఉంటోంది. దీనిని ఆనుకొనే జిల్లా పరిషత్​కు చెందిన 48 సెంట్ల స్థలం ఉంది. ఈ భూమిలో.. లే అవుట్ వేసేందుకు.. సన్నాహాలు సాగుతున్నాయి. లే అవుట్ వేసేందుకు కామాక్షి స్థలం అడ్డుగా ఉండటంతో ఎలాగైనా ఆమె ఇల్లు తొలగించేందుకు వైసీపీ నాయకులు పావులు కదిపినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

జగనన్న ఇల్లు మంజూరైందని చెప్పి కామాక్షిని నమ్మించి నాలుగు నెలల క్రితం వారు ఇల్లు తొలగించేలా చేశారు. ఆ తర్వాత జెడ్పీ స్థలాన్ని కామాక్షి కుటుంబం ఆక్రమించిందంటూ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలోనే కామాక్షి కుమారుడితో కలిసి టెంట్ వేసుకుని ఉంటుండగా.. అధికారులు ఒత్తిడి తెచ్చి టెంట్‌, సామాన్లు తీయించి కంచె వేశారు. దీంతో నిలువ నీడలేదన్న ఆవేదనతో.. ఇరువురు పురుగుల మందు తాగారు.

ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా.. పోలీసులు అధికారపక్ష నాయకులకు కొమ్ము కాస్తున్నారని తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సెల్ఫీ వీడియోలో పేర్లు వచ్చినంత మాత్రన.. వారినిపై చర్యలు తీసుకోలేమని తల్లీ కొడుకుల్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వారి గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పడం విశేషం.. మరోవైపు ఉన్నతాధికారులు ఈ వ్యవహరంపై గోప్యంగా విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.