సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ శ్రీనివాసరెడ్డిని హత్య చేసిన స్నేహితుడు.. అందుకేనా..!

author img

By

Published : Aug 1, 2022, 4:32 PM IST

Updated : Aug 1, 2022, 9:26 PM IST

murder case

16:27 August 01

నిందితులు ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, మిథున అరెస్టు

Software Srinivasa Reddy Murder Case: వారంతా స్థితిమంతులే కానీ వివాహేతర సంబంధం నాలుగు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. వివాహేతర సంబంధం బయటపెడతానని బెదిరించడమే కాకుండా.. తనతో సంబంధం ఉన్న మహిళను లొంగదీసుకున్న వ్యక్తిని కడతేర్చాడో ఓ వ్యక్తి. ఇందులో హతుడు, నిందితుడు బాల్య స్నేహితులు కావడం విశేషం. వారం రోజుల క్రితం కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం అళ్ళవారిపాలెంలో జరిగిన సాఫ్ట్​వేర్ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సూత్రధారులైన ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, ఆళ్ల మిథునలను పోలీసులు అరెస్టు చేసి.. సంచలన విషయాలను బయటపెట్టారు.

శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు బాల్య స్నేహితులు. శ్రీనివాస రెడ్డికి వివాహమై ఒక బాబు ఉన్నాడు. శ్రీకాంత్ రెడ్డికి వివాహమై 10 సంవత్సరాలు అయ్యింది. కానీ వారికి పిల్లలు లేరు. ఒకే గ్రామంలో ఉన్న ఇరు కుటుంబాలకు పొరుగున వివాహిత మిథున కుటుంబం ఉంది. మిథునకు నాలుగేళ్ల బాబు, 10 నెలల పాప ఉన్నారు. ఇటీవల మిథున భర్త అనారోగ్యానికి గురై.. అచేతన స్థితిలో ఉన్నాడు.

Arrest: ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి, మిథునకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహరం అనుకోని విధంగా బయటపడింది. పాడైన తన సెల్​ఫోన్​ను ఇంటి దగ్గరే ఉండి విధులు నిర్వహిస్తున్న మిత్రుడైన శ్రీనివాసరెడ్డికి ఇచ్చి రిపేర్​ చేయమని కోరాడు శ్రీకాంత్​రెడ్డి. సెల్​ఫోన్​ను ఫార్మెట్ చేసే క్రమంలో శ్రీకాంత్​రెడ్డి, మిథునలు ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు కనిపించాయి. వెంటనే తన ఫోన్​లోకి డౌన్​లోడ్ చేసుకున్న శ్రీనివాస రెడ్డి.. మిథునను లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఆ వీడియోలు బయటపెడతానని బెదిరించి.. ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన శ్రీకాంత్ రెడ్డి.. ఇది సరికాదని శ్రీనివాస రెడ్డిని అనేకసార్లు హెచ్చరించాడు. ఇటీవల కాలంలో తనకు శ్రీనివాస రెడ్డి నుంచి బెదిరింపులు, వేధింపులు ఎక్కువయ్యాయని శ్రీకాంత్ రెడ్డితో చెప్పింది మిథున.

అనేకసార్లు నచ్చచెప్పినా శ్రీనివాస రెడ్డి తన తీరును మార్చుకోకపోవడంతో.. హత్యకు పథక రచన చేశారు. జూలై 25వ తేదీ అర్ధరాత్రి అళ్ళవారిపాలెంలోని తన ఇంటికి రమ్మని శ్రీనివాస్ రెడ్డికి.. మిథున కాల్ చేసింది. అప్పటికే ప్రియురాలి ఇంటి వద్ద కాపు కాసిన శ్రీకాంత్ రెడ్డి.. ఇంటికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని కత్తితో పొడిచాడు. అయినా కోపం తీరకపోవడంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో విచక్షణరహితంగా కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మిథునతో కలసి పరారయ్యాడు. ఈ కేసును ఛాలెంజ్​గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హత్యకు సూత్రధారులైన ఇరువురిని అరెస్ట్​ చేశారు.


ఇది చదవండి:


Last Updated :Aug 1, 2022, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.