అన్నమయ్య జిల్లాలో దారుణం.. పది నెలల చిన్నారిని హతమార్చిన తల్లి
Published: Jan 16, 2023, 12:32 PM


అన్నమయ్య జిల్లాలో దారుణం.. పది నెలల చిన్నారిని హతమార్చిన తల్లి
Published: Jan 16, 2023, 12:32 PM
Mother Killed Her Daughter : ఆ చిన్నారికి 10 నెలలు. అందరి పిల్లలలాగే తల్లి పాలు తాగి.. అమ్మ ఒడిలో ఆదమరచి నిద్రపోయేది. కానీ అదే ఆ చిన్నారికి ఆఖరి నిద్ర అని ఎవరూ ఊహించలేదు. బిడ్డకు ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడే ఆ తల్లే తన పేగు తెంచుకున్న కన్న బిడ్డను కానరాని లోకాలకు పంపించింది. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
Mother Killed Her Daughter : ఎవరికైనా సేదతీరడానికి అమ్మ ఒడికి మించిన సరైన చోటు ఉండదు. ఇక చిన్న పిల్లలకైతే చెప్పాల్సిన పని లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ తల్లి ఒడే వారికి అన్ని. అన్నం తినడానికి, గారాలు పోవడానికి ఇలా ప్రతి పనికి దానినే ఎంచుకుంటారు. ఇక్కడ ఉన్న చిన్నారి కూడా వాళ్ల అమ్మ ఒడిలోనే తన చిన్ని పొట్టకు కావాల్సిన పాలు తాగి సేదతీరేది. అయితే ఆ చిన్నారికి తెలియదు కదా.. ఆ తల్లి ఒడే.. మృత్యు ఒడి అని. 10 నెలల చిన్నారిని కన్న తల్లే గొంతు నులిమి చంపిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లాలోని రాయచోటి మండలం నక్కలగుట్టలో మహమ్మద్ బాషా, ఫాతిమా దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి రుక్సానా అనే పది నెలల చిన్నారి ఉంది. ఫాతిమా గత కొంత కాలం నుంచి అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే రుక్సానాని గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం భర్త మహమ్మద్ బాషాకు జరిగిన విషయం చెప్పింది. బాషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు" అని తెలిపారు.
అయితే మానసిన స్థితి సరిగ్గా లేని ఫాతిమా.. తనకు ఏదైనా జరిగితే ఎవరూ చూసుకోలేరనే ఆందోళనతో కుమార్తెను చంపినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:
