Youngman Suicide: కొద్దిగంటల్లో పెళ్లి.. వరుడు ఆత్మహత్య.. ఏమైంది?

Youngman Suicide: కొద్దిగంటల్లో పెళ్లి.. వరుడు ఆత్మహత్య.. ఏమైంది?
Young man suicide: ఇల్లంతా పెళ్లిసందడి.. పచ్చని తోరణాలతో పెళ్లిపందిరి.. బంధువుల హడావిడి.. కొద్దిగంటల్లో పెళ్లి వస్త్రాలు ధరించి, నుదుటున బాసికం కట్టుకుని కూర్చోవాల్సిన వరుడు.. ఏమైందో తెలియదు కానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
Young man suicide: విశాఖలో హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేస్తున్న దినేష్ (28)కు తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదన్నా... దినేష్ మాట వినకుండా నిర్ణయించడంతో పెళ్లికొడుకును చేసిన ముందురోజు ఇంట్లో నుంచి వెళ్లి యారాడ బీచ్‌కు వెళ్లాడు. బంధువులు వెతికి ఇంటికి తీసుకువచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది. ఎలాగైనా పెళ్లిచేస్తారనుకున్న దినేష్... ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
