Miss South India మిస్‌ సౌత్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న విశాఖ ఛరిష్మా

author img

By

Published : Aug 17, 2022, 7:06 PM IST

MISS SOUTH INDIA

Miss South India అందరూ ఆర్థికంగా స్థిరపడే లక్ష్యంతో పని చేస్తుంటారు. కానీ.. ఇంకొందరు మాత్రం ప్యాషన్ వైపు అడుగులు వేస్తారు. తమదైన ప్రతిభ కనబరుస్తారు. ఈ కోవకే చెందుతుంది వైజాగ్‌ యువతి. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే తనకు నచ్చిన రంగాల్లోనూ విశిష్ట గుర్తింపు సాధిస్తోంది. నృత్యకారిణిగా ప్రస్థానాన్ని ప్రారంభించి చిత్రకళాకారిణిగా, మోడల్‌గానూ ఎదిగింది. అంతటితో ఆగకుండా ఇటీవల కొచ్చిలో జరిగిన అందాల పోటీల్లో మెరిసింది. మిస్‌ సౌత్‌ ఇండియా టైటిల్‌నూ సాధించింది. ఆమే వైజాగ్‌కు చెందిన ఛరిష్మా కృష్ణ.

Miss South India ఆసక్తి ఉండాలే కానీ... అన్ని రంగాల్లో రాణించడం పెద్దకష్టమేమి కాదని నిరూపిస్తోంది ఈ యువతి. ఓ వైపు విద్యార్థినిగా పుస్తకాలతో కుస్తీ పడుతూనే... తనకు నచ్చిన రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది. నృత్య కళాకారిణిగా, చిత్రకళాకారిణిగా, మోడల్‌గా రాణిస్తూనే... కేరళలోని కొచ్చిలో జరిగిన మిస్‌ సౌత్‌ ఇండియా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి టైటిల్‌నూ సొంతం చేసుకుంది ఈ అందాల బామ.

మిస్‌ సౌత్‌ ఇండియా

మిస్‌ సౌత్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఛరిష్మా... విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో విద్యను అభ్యసిస్తోంది. ఆగస్టు ఒకటో తేదీన పెగాసస్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్న ఛరిష్మా... సౌత్‌ ఇండియాలోని 5 రాష్ట్రాల యువతులతో పోటీ పడి ఈ గౌరవాన్ని అందుకుంది. వైజాగ్‌ యువతి ఛరిష్మా.

ఛరిష్మా తండ్రి అమెరికాలో పీహెచ్‌డీ చేస్తుండటంతో అక్కడే ఐదో తరగతి వరకు పూర్తి చేసింది. తర్వాత కుటుంబం వైజాగ్‌కు తిరిగి రావడంతో ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుకుంది. చదువుతో పాటు భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్న ఛరిష్మా.. ఇప్పటి వరకు సుమారు 30 ప్రదర్శనలు ఇచ్చింది.వాటన్నింట్లోనూ తనదైన ప్రతిభ కనబరుస్తున్నట్లు చెబుతోంది.

"మా నాన్న అమెరికాలో పీహెచ్‌డీ చేస్తుండటంతో అక్కడే ఐదో తరగతి వరకు పూర్తి చేశాను. తర్వాత కుటుంబం విశాఖకు తిరిగి రావడంతో ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుకున్నాను. చదువుతో పాటు భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నా. ఇప్పటి వరకు సుమారు 30 ప్రదర్శనలు ఇచ్చాను. వాటన్నింట్లోనూ నా ప్రతిభ కనబరుస్తున్నాను."-ఛరిష్మా కృష్ణా. మిస్‌ సౌత్‌ ఇండియా

ఈత, గుర్రపు స్వారీని సైతం నేర్చుకున్న ఛరిష్మా... నటిగా ఎదగాలనుకొని స్టార్మేకర్గా గుర్తింపు పొందిన ఎల్. సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకుంది. దీంతో ఛరిష్మాకు నటిగా అవకాశాలు లభించడంతో... పలు లఘ చిత్రాల్లోనూ నటించింది. గతేడాది 'జతగా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించినట్లు చెబుతోంది.

ఇదిలా ఉండగా గత సంవత్సరం విశాఖలో జరిగిన 'మిస్ వైజాగ్' అందాల పోటీల్లోనూ పాల్గొన్న ఛరిష్మా... తృతీయ స్థానంలో నిలిచింది. దీంతో తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకున్న యువతి. కేరళలో పెగాసస్‌ సంస్థ నిర్వహించిన మిస్‌ సౌత్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున పాల్గొనే అవకాశాన్ని పొందింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20 మంది యువతులతో పోటీపడి 'మిస్ సౌత్ ఇండియా' కిరీటాన్ని సాధించినట్లు చెబుతోంది.

"గత సంవత్సరం విశాఖలో జరిగిన 'మిస్ వైజాగ్' అందాల పోటీల్లోనూ పాల్గొన్నా. తృతీయ స్థానంలో నిలిచాను. నా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకున్నాను. కేరళలో పెగాసస్‌ సంస్థ నిర్వహించిన మిస్‌ సౌత్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున పాల్గొనే అవకాశాన్ని పొందాను. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20 మంది యువతులతో పోటీపడి 'మిస్ సౌత్ ఇండియా' కిరీటాన్ని సాధించాను."-ఛరిష్మా కృష్ణా. మిస్‌ సౌత్‌ ఇండియా

చిన్ననాటి నుంచి చురుకుగా ఉండే తమ కుమార్తే ఇంతటి విజయాన్ని సాధించడం పట్ల.. ఛరిష్మా తల్లిదండ్రుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ తనను అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించేందు సిద్ధంగా ఉన్నట్లు వారు చెబుతున్నారు.

మిస్‌ సౌత్‌ ఇండియా టైటిల్‌ సాధించిన ఛరిష్మా.. అంతకుముందు అనేక నృత్య ప్రదర్శనల్లో పాల్గొంది. 2016లో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షకు హాజరైన ప్రధాని నరేంద్రమోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో నృత్యం చేసే అరుదైన అవకాశాన్ని కూడా ఛరిష్మా దక్కించుకుంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కైలాసగిరి వెళ్లినప్పుడు ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన భరతనాట్య ప్రదర్శనలోనూ ఈ యువతి పాల్గొంది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో 'సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసిన ఛరిష్మా... అడవి బాపిరాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్‌ వారు అందించే ఉగాది ప్రతిభాపురస్కారం సైతం అందుకుంది. ఈ మిస్‌ సౌత్‌ ఇండియా ఛరిష్మా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.