"పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్తలు అవాస్తవం"
Updated on: May 13, 2022, 4:06 PM IST

"పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్తలు అవాస్తవం"
Updated on: May 13, 2022, 4:06 PM IST
Bride death case: విశాఖలో కలకలం సృష్టించిన పెళ్లి కూతురి హఠాన్మరణం ఘటనపై వధువు సోదరుడు వివరణ ఇచ్చారు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందని వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. సృజన హఠాన్మరణానికి కారణం తమకూ తెలియదని.. వైద్య నివేదికలు వస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు.
Bride death case: విశాఖలో కలకలం సృష్టించిన పెళ్లి కూతురి హఠాన్మరణం ఘటనపై వధువు సోదరుడు వివరణ ఇచ్చారు. వధువు సృజన ఆత్మహత్య చేసుకుందనే వార్తలను ఆయన ఖండించారు. సృజన ఇష్టపూర్వకంగానే ఈ సంబంధం కుదిర్చామని.. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిందని వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఆయన వివరణ ఇచ్చారు. పెళ్లిలో నెలసరి సమస్య రాకూడదని సృజన ముందుగా కొన్ని మాత్రలు వేసుకుందని.. వాటి కారణంగా రెండు రోజులుగా ఇబ్బంది పడిందని సోదరుడు తెలిపారు. పెళ్లికి ముందు రోజు కూడా ఆస్పత్రి వెళ్లొచ్చామని చెప్పారు. సృజన హఠాన్మరణానికి కారణం తమకూ తెలియదని.. వైద్య నివేదికలు వస్తే తప్ప ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు.
" ఇరువురి అంగీకారం తర్వాతే వివాహ నిశ్చయించాం. సృజనకు అనారోగ్య సమస్య ఉంది. నెలసరి రుతుక్రమాన్ని ఆపే ప్రయత్నంలో అనారోగ్యం పాలైంది. ఇతర అనుమానాలు ఏమీ మా కుటుంబాల్లో లేవు. గుర్తుతెలియని విషపదార్థమని వైద్యులు ఎందుకు అన్నారో తెలియదు. సృజనది ఆత్మహత్య అని మేము అనుకోవట్లేదు. సృజన హఠాన్మరణానికి కారణం తమకూ తెలియదు. వైద్య నివేదికలు వస్తే తప్ప ఏమీ చెప్పలేం"- సృజన సోదరుడు విజయ్
పోస్టుమార్టం పూర్తి: సృజన మృతదేహానికి విశాఖ కేజీహెచ్‌లో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కేజీహెచ్ సిబ్బంది అప్పగించారు. సృజన మృతదేహాన్ని స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చందానగర్‌కు తరలించారు. పోస్టుమార్టంలో మృతదేహం నుంచి సేకరించిన అవశేషాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఫోరెన్సిక్ నివేదిక బట్టి కేసు ఓ కొలిక్కిరావొచ్చని అభిప్రాయపడుతున్నారు.
విషపదార్థం వల్లే మృతిచెందినట్లు వైద్యుల ప్రాథమిక అంచనా రావడంతో... విషపదార్థం స్వీకరించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సృజన బ్యాగ్‌లో గన్నేరు పప్పు ఆనవాళ్లు సేకరించి పరీక్షకు పంపిన పోలీసులు వాటి ఫలితాల ఆధారంగా కేసు ఓ కొలిక్కిరావొచ్చని భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
