గోరంట్ల 'వీడియో' వ్యవహారంపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
Updated on: Aug 6, 2022, 3:10 PM IST

గోరంట్ల 'వీడియో' వ్యవహారంపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
Updated on: Aug 6, 2022, 3:10 PM IST
14:36 August 06
Women Commission: డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
Women commission letter to DGP: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై తక్షణం విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని మహిళా కమిషన్ డీజీపీకి లేఖ రాసింది. విచారణ జరిపి ఎంపీ గోరంట్లపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు. మహిళాలోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆమె డీజీపీని కోరారు.
MP Gorantla Madhav video viral: ఏం జరిగిందంటే..: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి కలకలం రేపింది. ఈనెల 4న (గురువారం) ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇదంతా తెదేపా, కొంతమంది మీడియా వ్యక్తుల కుట్ర అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.
TDP Protest: తెదేపా ఆందోళన: నగ్న వీడియోలతో మహిళను వేధించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. విచారణ పేరుతో వైకాపా పెద్దలు కాలయాపన చేయడం.. వారి ఆలోచనకు అద్దం పడుతోందని విమర్శించారు. పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన ఎంపీ మాధవ్‌ను పదవి నుంచి తొలగించాలన్నారు.
ఇవీ చూడండి
