విజయవాడ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆధార్ కార్డులో ఫొటో మార్ఫింగ్ చేసి కొరియర్!

author img

By

Published : May 2, 2022, 4:27 PM IST

Updated : May 3, 2022, 4:05 AM IST

విజయవాడ డ్రగ్స్ కేసు

సంచలనం రేపుతున్న విజయవాడ ఎపిడ్రిన్‌ పార్శిల్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోపిసాయికి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. కేసులో కీలక నిందితుడు చెన్నై వాసిగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని చెన్నైకు పంపారు.

విజయవాడ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్

విజయవాడ నగరాన్ని వణికిస్తున్న మత్తు పదార్ధం ఎఫిడ్రిన్ సరఫరా కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక నిందితుడు చెన్నై వాసిగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు . నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని చెన్నైకు పంపారు. భారతీనగర్ కొరియర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు . పార్శిల్ చేసిన నిందితుడి విజువల్స్ సేకరించారు . దీంతో పాటు కొరియర్ తేజకు ఇచ్చిన ఆధార్ జిరాక్స్​ను పరిశీలించారు. జిరాక్స్​లో అడ్రస్ గోపీసాయిది ఉన్నా.. ఫోన్ నెంబర్, ఫొటో వేరే వారిది ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఫోన్ ఆధారంగా ట్రాకింగ్ చేస్తే చెన్నైలో ఉన్నట్లు తేలింది.

గతంలో మూడుసార్లు కొరియర్ ద్వారా పార్శిల్ పంపిన వ్యక్తి ఇతనేనని సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. గోపిసాయి చెన్నైలో ఇంజినీరింగ్ చదివి ఇటీవల హైదరాబాద్​లో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం సొంతూరు నుంచి పని చేస్తున్నాడు. చెన్నైలో చదివేటప్పుడు గోపిసాయి జిరాక్స్​ను ఎవరో తీసుకుని ప్రస్తుతం వినియోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గోపికి పరిచయమున్న వ్యక్తా ? అతనితో చదువుకున్న యువకుల్లో ఎవరైనా ఈ దందా కొనసాగిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

డ్రగ్స్ సరఫరా కేసులో మొదట గోపిసాయి నిందితుడిగా భావించి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు .విచారణలో గోపికి సంబంధంలేదని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గోపి ఆధార్ అడ్రస్‌ను వినియోగించాడని తెలుసుకున్నారు. నిందితుడు చెన్నై వాడిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే చెన్నై నుంచి నిందితుడు విజయవాడ ఎందుకు వచ్చాడు? ఇక్కడున్న కొరియర్ గురించి ఎలా తెలిసింది ? నిందితుడు తెలుగు వాడా? చెన్నై వాసేనా ? అనే అంశాలు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మిగులుతున్నాయి.

ఇదీ చదవండి: విజయవాడ కేంద్రంగా.. విదేశాలకు మత్తు పదార్థాల సరఫరా

Last Updated :May 3, 2022, 4:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.