సీమలో చంద్రబాబు పర్యటన.. "బాదుడే బాదుడు"కు ఏర్పాట్లు

సీమలో చంద్రబాబు పర్యటన.. "బాదుడే బాదుడు"కు ఏర్పాట్లు
Chandrababu tours: వచ్చేవారం తెదేపా అధినేత వరుస పర్యటనలు చేయనున్నారు. మహానాడు లోపు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
Chandrababu tours: తెదేపా అధినేత చంద్రబాబు వచ్చే వారం రాయలసీమ జిల్లాల్లో వరుస పర్యటనలు చేయనున్నారు. 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల్లో భాగంగా గత వారం ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు.. ఈ వారం సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే వారం 18వ తేదీన కడప జిల్లాలోని కమలాపురం, 19న నంద్యాల జిల్లాలోని డోన్, 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహానాడు నిర్వహించే లోపు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ చుట్టేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
