రాష్ట్రవ్యాప్తంగా 52 డ్రోన్లతో సమగ్ర భూ సర్వే ప్రక్రియ: మంత్రుల కమిటీ

author img

By

Published : May 13, 2022, 7:19 PM IST

రాష్ట్రవ్యాప్తంగా 52 డ్రోన్లతో సమగ్ర భూ సర్వే ప్రక్రియ

రాష్ట్రవ్యాప్తంగా 52 డ్రోన్లతో సమగ్ర భూ సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రుల కమిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 2,149 గ్రామాల్లో డ్రోన్ ద్వారా భూ సర్వే పూర్తైందన్నారు. త్వరలో సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్రం, ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా 172 డ్రోన్లు రానున్నాయని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్లతో సమగ్ర భూ సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా, ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 172 డ్రోన్లు సమకూర్చుకోనున్నట్లు మంత్రులు తెలిపారు. ఇప్పటి వరకూ 2,149 గ్రామాల్లో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి అయ్యిందని వివరించారు. సచివాలయంలో భూసర్వే ప్రక్రియపై సమావేశమైన మంత్రుల కమిటీ దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించింది. 756 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామని కమిటీ వెల్లడించింది. ప్రజల నుంచి 9,283 అప్పీళ్లు అందాయని అందులో 8,935 పరిష్కరానికి గురయ్యాయని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు.

సమగ్ర భూసర్వే ప్రక్రియలో భాగంగా 18,487 సర్వే రాళ్లను పాతి సరిహద్దులు నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో 5548.90 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల నిర్మాణాలు, 7 లక్షల మేర ఖాళీ స్థలాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెడుతున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు లేకుండా ఈ సర్వే మంచి పరిష్కారాన్ని చూపుతుందని అన్నారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో నివాసాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అర్భన్ ప్రాంతంలోని ఖాళీ భూములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అత్యంత శాస్త్రీయంగా సర్వే ద్వారా నిర్ధారించాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.