రాష్ట్రంపై తుఫాను ప్రభావం.. పలు జిల్లాల్లో నేలకొరిగిన పంట

author img

By

Published : May 8, 2022, 7:55 PM IST

నెలకొరిగిన పంట

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సం కొనసాగింది. దీంతో.. చాలా చోట్ల పంటనష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వర్షం దెబ్బతీయడంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పంట నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళనకు గురయ్యారు. కొంతమంది రైతుల ధాన్యం రాశులు కళ్లాల్లో ఉండటంతో తడవకుండా ఉండేందుకు అన్నదాతలు శ్రమించారు. కోనసీమ జిల్లాలో ఒక్కసారి వాాతావరణం మారిపోయి వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పంట నష్టం సంభవించే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. విజయవాడ నగరంలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. దుమ్ముతో కూడిన ఈదురుగాలులు రావటంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వాతావారణం చల్లబడటంతో ఎండతీవ్రతతో అల్లాడుతున్న నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ గాలులతో కొబ్బరి, అరటి తోటలు, మామిడి, బొప్పాయి పంట నేలరాలాయి. కొన్ని చోట్ల 60 శాతం వరకు అరటి తోటలు నేలకొరిగాయి. చల్లపల్లిలో విద్యుత్ స్తంభం విరిగిపోయి..విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అవనిగడ్డ కృష్ణా కరకట్టపై ఉన్న వృక్షాలు నెలకొరగటంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం తదితర మండలాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.