నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే.. మంత్రి బొత్సను అరెస్టు చేయాలి కదా? : ఎంపీ రఘురామ

author img

By

Published : May 10, 2022, 5:33 PM IST

MP RRR

MP RRR: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్​పై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నారాయణ పాఠశాలలో ప్రశ్నాపత్రం లీకైందని ఆ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేశారు. మరి అలాంటప్పడు 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పుచేశారని కేసు నమోదు చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు.

MP RRR: నారాయణ పాఠశాలలో ప్రశ్నాపత్రం లీకైందని ఆ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్ట్ చేసినప్పుడు.. 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పుచేశారని కేసు నమోదు చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్ట్‌ చేస్తారా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. నారాయణను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే.. ఒకేసారి రెండు కేసుల్లో ఎఫ్​ఐఆర్​ (F.I.R)లు నమోదు చేశారన్నారు. గత అనుభవాల దృష్ట్యా.. నారాయణ కుటుంబ సభ్యులు వెంటనే కోర్టును ఆశ్రయించి న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగేలా చూడాలని సూచించారు.

నారాయణ అరెస్టు న్యాయం అనుకుంటే... మంత్రి బొత్సను అరెస్టు చేయాలి కదా?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.