ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని చెప్పలేదుగా.. నేనేమన్నానంటే  : మంత్రి పెద్దిరెడ్డి

author img

By

Published : May 12, 2022, 5:25 PM IST

ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని నేను చెప్పలేదు

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో.. ఫోన్లు ట్యాప్ చేశామన్న మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ మాట మార్చారు. ఫోన్లు ట్రాకింగ్ చేశారని మాత్రమే తాను అన్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఫోన్లు ట్యాపింగ్ చేశారని తాను చెప్పిఉంటే అది తప్పేనని అన్నారు.

ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని నేను చెప్పలేదు

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఫోన్లు ట్యాప్ చేశామన్న మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ మాట మార్చారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశామని తాను చెప్పలేదని.., ఫోన్లు ట్రాకింగ్ చేశారని మాత్రమే తాను చెప్పినట్లు వెల్లడించారు. ఫోన్లు ట్యాపింగ్ చేయటం నేరమని అందరికీ తెలుసని అన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేశారని తాను చెప్పిఉంటే అది తప్పేనని అన్నారు.

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించటం సరికాదని పెద్దిరెడ్డి అన్నారు. పారదర్శకత కోసమే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తుందన్నారు. కరెంటు బిల్లు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని, రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్ బిల్లులు కడతారన్నారు. మీటర్లు ఏర్పాటు విజయవంతమైతే రైతులు తనకు ఓట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్న పెద్దిరెడ్డి.. ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 14 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా పని చేసిన చంద్రబాబు.. ఎక్కడా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.., శ్రీలంకకు ఇక్కడికీ పోలికే లేదని అన్నారు. ప్రభుత్వంపై కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆక్షేపించారు.

ఫోన్ ట్యాపింగ్​పై పెద్దిరెడ్డి ఏమన్నారంటే..: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి నిజమైన బాధ్యులను అరెస్టు చేశారన్నారు. లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని వెల్లడించారు. మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా ప్రశ్నపత్రాలు లీకవ్వలేదని ప్రకటించారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. 'అదే మంత్రి 60 మందిని అరెస్టు చేయించారుగా.. అయినా విచారణ పూర్తయ్యేదాకా ఎవరైనా విలేకరుల ముందుకొచ్చి పేపర్‌ లీకైందని.. ఇంత మందిని అరెస్టు చేశామని చెబుతారా ?' అని బదులిచ్చారు. మీ విద్యాశాఖ మంత్రే చెప్పారు కదా? అని విలేకరులు మళ్లీ ప్రశ్నించగా.. 'నేను విద్యాశాఖ మంత్రిని కాదు. సీఎంవోకు వెళ్లి అడిగితే అరెస్టు విషయం చెప్పారు' అని మంత్రి సమాధానమిచ్చారు.

పెద్దిరెడ్డి వ్యాఖ్యలు షాక్​కు గురిచేశాయి: మాజీమంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డెడ్​గా చెప్పటం షాక్​కు గురిచేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తెదేపా నేతలపై కక్ష సాధించేందుకు వైకాపా చట్టాలు, రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తోందన్నది మరోసారి బహిర్గతమైందన్నారు. ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కేందుకు స్వేచ్ఛనిచ్చే ఫాసిస్టు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారుతోందని ఆక్షేపించారు. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైకాపా ఓవర్ టైమ్ పని చేస్తుండటం సిగ్గుచేటన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.