ఇకపై ప్రముఖులు ఆలయాలకు వస్తే.. మరింత కఠిన బందోబస్తు : మంత్రి సత్యనారాయణ

author img

By

Published : May 10, 2022, 7:44 PM IST

Minister Satyanarayana

Minister Satyanarayana visited Druga Temple : రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు.

Minister Satyanarayana visited Durga Temple: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్‌ అంశాలపైనా మంత్రి ఆరా తీశారు. అమ్మవారి సన్నిధిలో పారిశుధ్యం, ఇతర సదుపాయాలను పర్యవేక్షించారు.

అమ్మవారి ఆలయానికి 19 రోజులకు రెండు కోట్ల 64 లక్షల 25 వేల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. రోజుకు సగటున 13.90 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని.. కానుకల రూపములో బంగారం 536 గ్రాములు, వెండి.. 6 కేజీల 60 గ్రాములు.. సమర్పించినట్లు వివరించారు. ఈ-హుండీ ద్వారా 80 వేల 868 సమకూరినట్లు తెలిపారు. ఆలయ హుండీ లెక్కింపు సమయంలో కొందరు అమ్మవారికి టోకరా వేసేందుకు ప్రయత్నించిన వ్యవహారాన్ని ఆలయ అధికారులు మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. 12 తులాలపైనే బంగారు ఆభరణాలను అపహరించేందుకు కొందరు ప్రయత్నించారని, ఎస్పీఎఫ్ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో ఈ ఉదంతం బయటపడిందని తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎస్పీఎఫ్ సిబ్బంది పురుషుల మరుగుదొడ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడ రెండు చిన్న ప్లాస్టిక్‌ కవర్లను గుర్తించారని.. వాటిలో ఒకదానిలో పది బంగారు ఉంగరాలు, మరొకదానిలో ఒక నెక్లెస్‌, ఒక బంగారు తాడు ఉండడాన్ని గుర్తించి వాటిని అధికారులకు అప్పగించారని.. సీసీ కెమేరా ద్వారా ఆభరణాలు ఎవరు తీసుకెళ్లారనేది పరిశీలన జరుపుతున్నట్లు మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం అయినందున, పోలీసు కేసు నమోదుతోపాటు సమాంతరంగా శాఖాపరంగా కూడా దర్యాప్తు చేయిస్తామని మంత్రి తెలిపారు. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

ఇటీవల సినీనటుడు రామ్‌చరణ్‌ ఆలయ సందర్శన వచ్చిన సమయంలో అభిమానులు ఆలయంలోని హుండీలు ఎక్కి సెల్‌ఫోన్‌ ద్వారా అమ్మవారి దృశ్యాలు చిత్రీకరించిన ఉదంతాలను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. సెలబ్రిటీలు ఆలయ సందర్శనకు వచ్చే సమయంలో బందోబస్తు మరింత కఠినతరం చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.