cm jagan review on floods : దెబ్బతిన్న ప్రతి ఇంటికీ పరిహారం: సీఎం జగన్

author img

By

Published : Nov 22, 2021, 2:29 PM IST

Updated : Nov 22, 2021, 5:32 PM IST

cm jagan review on floods affected district

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో(cm jagan review on floods) ముఖ్యమంత్రి జగన్​ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయకచర్యలు, బాధితులకు అందించాల్సిన సాయంపై చర్చించారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని.. వారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్‌(cm jagan video conference) అధికారులను అదేశించారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, వంటనూనె, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు, రూ.2వేలు ఇవ్వాలన్నారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకొని, వాలంటీర్ల సేవలను వినియోగించుకొని ప్రతి ఇంటికీ సాయం అందించాలన్నారు.

ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలని అధికారులను సీఎం ఆదేశించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని.. వారికి అందించే సేవల్లో ఎలాంటి లోటు రానివ్వకూడదని పేర్కొన్నారు. బాధితులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయే సమయంలో రూ.2వేలు ఇవ్వాలన్నారు. విద్యుత్‌, తాగునీటి పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వరద బాధితులకు అందించాల్సిన సదుపాయాలపై సీఎం జగన్‌.. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

కాల్‌ సెంటర్‌ను సంప్రదించండి..
వరదలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. 104 కాల్‌ సెంటర్‌ను సంప్రదించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 104కు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశించారు. జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారిని నియమించాలని, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించారు. ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు డిజైన్లు రూపొందించి, శాశ్వత పనులు చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారు చేసి పనులు మొదలయ్యేలా పంచాయతీరాజ్, మున్సిపల్‌ విభాగాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా.. వారికి వెంటనే నగదు సాయం అందించాలని, ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే బాధితులకు రూ. 95,100 అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5,200 వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించాం. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలి. వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. బాధితుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం వెంటనే అందించాలి. వారంతా విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాడానికే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామం. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి’’

-సీఎం జగన్‌

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి..
వరదల్లో మరణించిన పశువుల కళేబరాల వల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టి వాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోవాలన్నారు. పంటల నష్టం ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టి, విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు. చెరువులు, ఇతర జలాశయాలు, గట్లమీద ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. నిరంతరం అప్పమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండాలన్న సీఎం.. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తం రూ.40 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గండ్లు పడ్డ చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ అధికారులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇదీ చదవండి..:

Floods in Tirupati: తిరుపతికి తప్పని వరద.. ముంపులోనే పలు కాలనీలు

Last Updated :Nov 22, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.