మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్
Updated on: May 12, 2022, 4:10 PM IST

మంత్రి అంబటిపై అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్
Updated on: May 12, 2022, 4:10 PM IST
-
సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబు కి వాట్సాప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్...ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు...త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి. మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం 1/2
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 12, 2022
15:30 May 12
త్వరలో కాంబాబు బర్తరఫ్ ఖాయం: అయ్యన్నపాత్రుడు
మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్‌ను లైంగింకంగా వేధించిన వ్యవహారంలో కాంబాబుపై చర్యలు ఖాయమంటూ అయ్యన్న ట్వీట్ చేశారు. 'సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటూ.. కాంబాబుకు యూట్యూబ్ ఛానల్ యాంకర్ వాట్సాప్ మెసేజ్ చేసింది. ఇంటర్వ్యూ ఇస్తే.. నాకేం ఇస్తావు అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు. త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్టర్ వేదికగా పోస్టు చేశారు.
