ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి

author img

By

Published : Nov 23, 2021, 5:19 PM IST

శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి

శాసనమండలి రద్దు (AP Council Abolition news) నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ తీర్మానం చేసిందని పీటీఐ వార్త సంస్థ కథనాన్ని వెలువరించింది. గతంలో చేసిన మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనందున.. అప్పటి తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సభలో పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు (step backed on council abolition) నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. గతంలో చేసిన మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనందున.. అప్పటి తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చర్చ సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నట్లు పీటీఐ వార్త కథనం వెలువరించింది.

మండలిని రద్దు చేయాలంటూ గత ఏడాది జనవరి 27వ తేదీన సీఎం జగన్‌.. అసెంబ్లీలో తీర్మానం చేశారని ప్రజాప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం అప్పట్లో ప్రకటించారని పీటీఐ వెల్లడించింది. గతంలో 58మంది సభ్యులతో మైనార్టీలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రస్తుతం ఆధిక్యంలోకి వచ్చినట్లు తెలిపిన పీటీఐ వార్తా సంస్థ.. ఈ పరిస్థితుల్లో మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని వెల్లడించింది. రద్దుపై నిర్ణయం తీసుకోవాలంటూ 22 నెలలుగా కేంద్రానికి వివిధ సందర్భాల్లో వివరించినా ఫలితం లేకపోవడంతో పాటు అంశాన్ని చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టిందని మంత్రి బుగ్గన తెలిపినట్లు పేర్కొంది. దీనిపై సభ్యుల్లో సందిగ్ధత ఏర్పడిందన్న మంత్రి...వాటన్నింటికీ తెరదించుతూ మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభలో ప్రకటించారని వెల్లడించింది. ఈ మేరకు కౌన్సిల్‌ రద్దు నిర్ణయాన్ని విరమించుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పీటీఐ తెలిపింది.

ఇదీ చదవండి

KONDAPALLI: రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.