AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM
Published on: Jul 31, 2022, 4:59 PM IST

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM
Published on: Jul 31, 2022, 4:59 PM IST
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
- వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో పసిడి.. 300కేజీలు ఎత్తిన 19ఏళ్ల యువకెరటం
19ఏళ్ల భారత వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగా కామన్వెల్త్ రికార్డులు తిరగరాశాడు. 67కేజీల మెన్స్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. స్నాచ్‌లో గరిష్ఠంగా 140 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 160కేజీలు ఎత్తాడు. మొత్తంగా 300 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
- సోమవారం నుంచి సినిమా షూటింగ్‌లు బంద్
తెలుగు సినీ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి షూటింగ్‌లు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు చిత్రీకరణలు జరిపేది లేదని నిర్మాత దిల్‌రాజు తెలిపారు.
- "నా బండికే డ్యాష్ ఇస్తావా..? నీ అంతు చూస్తా".. బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి
WOMAN ATTACK: ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు పెరుగుతున్నాయి. బండి పక్కకు తీయమన్నందుకు కొందరు.. నన్నే దాటేస్తావా అని మరికొందరు అసభ్యపదజాలంతో దూషించడం లాంటివి ఎక్కువవుతున్నాయి. గత నెలలో విజయవాడలో ఓ ఇద్దరు యువకులు బస్సు డ్రైవర్‌పై దాడి మరువకముందే.. మరో మహిళ హల్చల్ చేసింది.
- చీకోటి ప్రవీణ్ క్యాసినో దందాపై కూపీ లాగుతోన్న ఈడీ.. డొంకంతా కదిలేనా..?
Casino Issue: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగుతోంది. ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్‌తో రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలపై ఈడీ దృష్టి సారించింది. హవాలా మార్గం ద్వారా డబ్బులు విదేశాలకు తరలించడంతో పాటు ప్రవీణ్ దందాలో ప్రముఖుల పాత్రపై ఆరా తీస్తోంది.
- శివసేన నేత సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ
శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మరింత లోతైన విచారణ కోసం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్ ఇంటికి చేరుకుంది.
- ఆపరేషన్ ఝార్ఖండ్: 'రూ.10 కోట్లు, మంత్రి పదవి.. అసోం సీఎంతో మీటింగ్!'
పెద్ద ఎత్తున నగదుతో ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కేసు సీఐడీకి బదిలీ అయింది. కాగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, పట్టుబడిన శాసనసభ్యుల ద్వారా మిగతా ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రిపదవులను ఆశజూపిందని ఆరోపించారు.
- ఆరు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఐసిస్‌తో లింకులు ఉన్నవారే టార్గెట్!
NIA Conducts Searches: మహారాష్ట్ర, గుజరాత్ సహా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో దాడులు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఐసిస్ ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
- భగభగ మండుతూ.. భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్ శకలాలు
China Rocket Crash: ప్రపంచ దేశాలకు చైనా ఏదో ఒక రూపంలో సమస్యలు సృష్టిస్తూనే ఉంది. కరోనా పుట్టుకకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న డ్రాగన్ దేశం.. ఇటీవల లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ వైఫల్యంతో కొత్త చిక్కులు తీసుకొచ్చింది. చైనా రాకెట్ శకలాలు భగభగ మండుతూ శనివారం అర్ధరాత్రి భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. నాసా సహా అంతరిక్ష శాస్త్ర నిపుణులను ఆందోళనకు గురిచేశాయి.
- 'భయం వద్దు.. మన విమానాల్లో ప్రయాణం సురక్షితం!'
Airline safety India : భారత విమానయాన రంగం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు డీజీసీఏ సారథి అరుణ్ కుమార్. స్పైస్‌జెట్ సహా కొన్ని దేశీయ సంస్థల విమానాల్లో ఇటీవల సమస్యలు తలెత్తినా.. అవి ఆందోళన చెందాల్సినంత తీవ్రమైనవి కాదని భరోసా ఇచ్చారు.
- 'బింబిసార 2'లో ఎన్టీఆర్!.. హీరో కల్యాణ్‌రామ్ క్లారిటీ
NTR KalyanRam Bimbisara movie: హీరో కల్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. అయితే ఈ మూవీ సీక్వెల్లో హీరో ఎన్టీఆర్ కూడా నటించే అవకాశముందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా కల్యాణ్‌రామ్ క్లారిటీ ఇచ్చారు.

Loading...