Top news: ప్రధానవార్తలు @3PM

author img

By

Published : Dec 5, 2021, 2:57 PM IST

3pm_Topnews

.

Former CM Rosaiah cremation: మరి కాసేపట్లో మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు..
మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. కొంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రోశయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలకు ప్రముఖులతోపాటు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సాయంత్రానికి అల్పపీడనంగా మారనున్న వాయుగుండం!
    weather updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశా కదులుతోందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాయుగుండం సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గృహం విద్యార్థుల నిరసన
    Yogi Vemana University: పెరిగిన మెస్ బిల్లులు తగ్గించాలని కోరుతూ కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలోని వసతి గృహం ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నెలకు మూడు వేల రూపాయలు డబ్బులు చెల్లించాలంటే ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు వాపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం
    Visaka RK beach: విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి మొత్తం బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. అలాగే పిల్లల పార్కులో అడుగు మేర, సమీపంలో పది అడుగుల మేర భూమి కుంగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మంత్రి రాకతో అసెంబ్లీ అపవిత్రం.. గంగాజలంతో శుద్ధి'
    Ganga jal in assembly: రాష్ట్ర మంత్రి, అధికారపక్ష ఎమ్మెల్యే అడుగుపెట్టడం వల్ల అసెంబ్లీ అపవిత్రమైందని ఆరోపిస్తూ ఒడిశాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పూజారి వస్త్రధారణలో వచ్చి.. గంగాజలం, గోమూత్రం జల్లి అసెంబ్లీని శుద్ధి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Omicron Delhi: భారత్​లో ఐదో ఒమిక్రాన్​ కేసు- దిల్లీలో ఒకరికి నిర్ధరణ
    Omicron cases in America: ఒమిక్రాన్​ కేసులు అమెరికాలో మరింతగా విస్తరిస్తున్నాయి. శనివారం తొలికేసు నమోదు కాగా.. తాజాగా మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్​ సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమెరికాలో విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ కేసులు!
    Omicron cases in America: ఒమిక్రాన్​ కేసులు అమెరికాలో మరింతగా విస్తరిస్తున్నాయి. శనివారం తొలికేసు నమోదు కాగా.. తాజాగా మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒమిక్రాన్​ వార్తలు, ఆర్​బీఐ అంచనాలే స్టాక్ మార్కెట్లకు కీలకం!
    Market Outlook Next Week: ఈ వారం స్టాక్ మార్కెట్లకు ఆర్​బీఐ సమీక్ష అంచనాలతో పాటు కరోనా కొత్త వేరియంట్​ అయిన ఒమిక్రాన్​కు సంబంధించిన వార్తలు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత వారం మిశ్రమంగా కదిలాడి.. చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఈ సారి తేరుకుంటాయా? లేదా? అనే విషయంపై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • BWF World Tour Finals: పీవీ సింధు ఓటమి.. రజతం కైవసం
    BWF World Tour Finals: బీడబ్ల్యూ వరల్డ్​ టూర్ ఫైనల్స్​లో భారత స్టార్​ షట్లర్​ వెండి పతకం​ దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్​లో ప్రపంచ ఆరో ర్యాంకర్​ సియాంగ్​ చేతిలో 16-21, 12-21 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పుష్ప' ట్రైలర్​కు​ కౌంట్​డౌన్.. అర్హ వాల్ క్లైంబింగ్
    Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల సంగతులతో పాటు అర్హ వాల్​ క్లైంబింగ్​ గురించి కూడా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.