appcc: కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు యోచన: మాజీ మంత్రి చింతా మోహన్‌

author img

By

Published : Sep 19, 2021, 8:46 AM IST

congress state president change plan

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై పార్టీ ఆలోచన చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ వెల్లడించారు. దీపావళి తర్వాత కొత్త పీసీసీని ఎంపిక చేస్తామని తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వివరించారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై పార్టీ ఆలోచన చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్‌ చింతా మోహన్‌ వెల్లడించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ మచ్చలేని ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడి కోసం వెతుకుతున్నామని, దీపావళి తర్వాత కొత్త పీసీసీని ఎంపిక చేస్తామని వివరించారు.

చంద్రబాబు నివాసంపై దాడికి యత్నంపై ఖండన

ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నివాసంపై అధికార పార్టీ దాడికి యత్నించడాన్ని చింతా మోహన్‌ ఖండించారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించినప్పుడే అధికార పార్టీకి గౌరవం ఉంటుందని, అధికారంలో ఉన్న వ్యక్తి శత్రువును కూడా ప్రేమించగలిగే మనసు ఉండాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి సిద్ధం ఉందన్నారు. ఇందులో రేణిగుంట రోడ్డులోని సీఆర్‌ఎస్‌, తిరుపతి రైల్వేస్టేషన్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని అమ్మకానికి పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. తితిదే ధర్మకర్తల మండలిలో తీహార్‌ జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లకూ చోటు కల్పించడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి. GOVERNOR : చంద్రబాబు నివాసంపై దాడి ఘటనను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.