CM Tirupathi Tour: తిరుపతిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం జగన్

author img

By

Published : Oct 11, 2021, 5:20 PM IST

తిరుపతిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం జగన్

తిరుపతిలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తిరుపతి బర్డ్‌ ఆస్పత్రిలో పిల్లల చికిత్స కేంద్రంతో పాటు అలిపిరి శ్రీవారి పాదాల వద్ద గోమందిరం, ఆధునికీకరించిన అలిపిరి కాలినడక మార్గాన్ని ప్రారంభించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి వచ్చిన సీఎం జగన్..బర్డ్‌ ఆస్పత్రిలో పిల్లల గుండెజబ్బుల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం..అలిపిరి శ్రీవారి పాదాల దగ్గర గోమందిరం, ఆధునికీకరించిన అలిపిరి కాలినడక మార్గాన్ని ప్రారంభించారు.

ఇవాళ, రేపు తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్..సాయంత్రం బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. తర్వాత తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుని..ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం ఐదున్నర గంటలకు శ్రీవారి దర్శనం చేసుకోనున్న జగన్.. ఎస్వీబీసీ (SVBC) కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభిస్తారు. అలాగే..కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించనున్న సీఎం రైతు సాధికార సంస్థ, తితిదే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

జగన్​కు ఘన స్వాగతం

అంతకుముందు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్​కు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాగతం పలికారు.

ఇదీ చదవండి

CM Tirupathi Tour: తిరుపతి చేరుకున్న సీఎం జగన్.. తెదేపా, వామపక్ష నేతల గృహనిర్బంధం !

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.