Blood donors: రక్తదాతలకు చిరునామా.. ఆ జిల్లా !

author img

By

Published : Jun 18, 2022, 9:59 PM IST

Blood donors

Blood donors: నెల్లూరు జిల్లా రక్తదానం చేసే దాతలకు కేరాఫ్‌ అడ్రాస్‌గా నిలుస్తోంది. జిల్లాలో రెడ్‌ క్రాస్‌ సంస్థ ఏర్పాటు కాకముందు నుంచే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు దాతలు. వీరు నెల్లూరులోనే కాకుండా ఇతర రాష్ట్రాల వారికీ అవసరమైనప్పుడల్లా రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తి దాతలుగా నిలుస్తున్నారు.. నెల్లూరు రక్తదాతలు.

Blood donors: రెడ్‌ క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు నెల్లూరు జిల్లా రక్తదాతలు. 100 సార్లకు పైగా రక్తం దానం చేసిన దాతలు ఎందరో ఈ జిల్లాలో ఉన్నారు. వారు దాతలుగానే కాకుండా వాలంటీర్లుగా సేవ చేస్తూ.. ఎంతో మందికి అవగాహన కల్పిస్తున్నారు. వీరు చేస్తున్న సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులతో పాటు ప్రతి ఏడాది ప్రభుత్వం మోమోంటోలను ఇస్తోంది. 100 సార్లకు పైగా రక్తదానం చేసిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు రెడ్‌ క్రాస్‌ సంస్థ.

ఏడాదికి నాలుగుసార్లు పురుషులు రక్తం దానం చేయాలని.. 106 సార్లు రక్తదానం చేసిన చిరు వ్యాపారి మధుసూదనరావు అన్నారు. నాలుగు నెలలకొసారి ఏడాదికి మూడు సార్లు మహిళలు రక్తదానం చేయవచ్చని.. దీని వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని ఆయన తెలిపారు. అవసరమైన వారు ఎప్పుడు అడిగిన రక్తదానం చేస్తున్నాని.. ఇప్పటివరకు 109 సార్లు రక్తం ఇచ్చానని సురేష్‌ అన్నారు.

ప్రతి ఏడాది నెల్లూరు రెడ్‌ క్రాస్‌ కేంద్రంగా 25 వేల మంది నుంచి రక్తాన్ని సేకరిస్తున్నామని.. దానిని మూడు రకాలుగా విడగొట్టి 45 వేల మందికి ఉపయోగిస్తున్నామని.. లైన్స్ క్లబ్ లో పనిచేసే చంద్రశేఖర్ అన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్లాస్మాను ఇక్కడి నుంచి అనేక జిల్లాలకు పంపిస్తామని.. 85 సార్లు రక్త దానం చేసిన సతీష్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు.

రెడ్‌క్రాస్‌ సంస్థ లాభాలు లేకుండా సేవ చేస్తోందని.. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు తెలిపారు. రక్తదానం గొప్పదానం.. ఒక్కసారి ఇచ్చిన రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతోంది. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని రెడ్‌క్రాస్‌ సంస్థ కోరుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.