ETV Bharat / city

చంద్రబాబుకు ఓటేస్తా, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి షాకింగ్​ సమాధానం

MLA Saiprasad Reddy ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ఓ మహిళ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ఈ సారి ఎవరికి ఓటు వేస్తారన్న ఎమ్మెల్యే ప్రశ్నకు కాసేపు తల పట్టుకునేలా చేసిన సమాధానం ఇచ్చింది ఆ మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.

MLA Saiprasad Reddy
సాయిప్రసాద్‌రెడ్డి

Published : August 30, 2022 at 10:01 AM IST

Choose ETV Bharat

ఎమ్మెల్యే: అమ్మఒడి, జగనన్న చేయూత, నేతన్న నేస్తం.. ఈ పథకాలన్నీ ఎవరిస్తున్నారు?

గంగమ్మ: మీరే.

ఎమ్మెల్యే: నేను కాదమ్మా.. ప్రభుత్వం ఇస్తోంది. అందరికీ అందుతున్నాయి కదా. ఈసారి ఓటెవరికి వేస్తావు?

గంగమ్మ: చంద్రబాబునాయుడికి.

ఎమ్మెల్యే: ఓ.. ఇంతసేపు చెప్పిందంతా ఉత్తదాయనా

ఇదీ కర్నూలు జిల్లా ఆదోని 17వ వార్డులో సోమవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి, మహిళ గంగమ్మకు మధ్య సంభాషణ. పట్టణవాసులు ఎమ్మెల్యేకు పలు సమస్యలను విన్నవించారు. అఖరి విడత విద్యా దీవెన రాకపోవడంతో రూ.52 వేలు సొంతంగా చెల్లించి విద్యా ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకున్నానని పీజీ విద్యార్థి కల్యాణ్‌.. ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దర్జీ వృత్తే ఆధారంగా జీవిస్తున్న తనకు చేదోడుసాయం అందలేదని వితంతు మహిళ జానకి వాపోయారు. తమకు జగనన్న ఇళ్ల స్థలాలు రాలేదని గంగమ్మ, రజియా, రేష్మాబాను, హుసేనమ్మ, సుచిత్ర తదితరులు వివరించారు. గతంలో స్థలాల కోసం రూ.2,100 డీడీలు చెల్లించామని, స్థలం మాత్రం చూపలేదని పలు కుటుంబాలు మొరపెట్టుకున్నాయి.

ఇవీ చదవండి: