గుంటి రంగస్వామికి తుంగభద్ర జలాలతో అభిషేకం..

గుంటి రంగస్వామికి తుంగభద్ర జలాలతో అభిషేకం..
Gunti Rangaswami: కర్నూరు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వెంకటాపురంలోని గుంటి రంగస్వామికి స్థానికులు తుంగభద్ర జలాలతో అభిషేకం చేశారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారు..? అయితే ఈ కథనం చదవండి..
Gunti Rangaswami: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని వెంకటాపురంవాసులు ప్రతీ ఏడాది శ్రావణమాసంలో స్థానిక రంగస్వామికి తుంగభద్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఇందు కోసం గ్రామస్థులు 25 కిలోమీటర్లు దూరం కాలినడక వెళ్లి తుంగభద్ర జలాలు తీసుకొస్తారు. ఈ ఆచారాన్ని వాళ్లు తరతరాలుగా పాటిస్తున్నారు. తుంగభద్ర జలాలను మేళతాళాల నడుమ వేడుకగా గ్రామానికి తీసుకొస్తారు. ఈ సమయంలో మహిళలు నేలపై పడుకోగా జలాలు తీసుకొస్తున్న వారు వారిపై నుంచి నడిచి వెళ్తారు. ఇలా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని స్థానికుల నమ్మకం. సుమారు వెయ్యి మంది వరకు కాలి నడకన వెళ్లి తుంగభద్ర జలాలు తీసుకొస్తారు. ప్రతీ ఏడాది ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని, గ్రామం సుభిక్షంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.
ఇదీ చదవండి:
