KADAPA RAINS: మైలవరం జలాశయం వద్ద హైఅలెర్ట్.. నేడు విద్యా సంస్థలకు సెలవు

author img

By

Published : Nov 20, 2021, 10:59 AM IST

మైలవరం జలాశయం వద్ద హైఅలెర్ట్

భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లాలో(rains in kadapa district) నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగాయి. వరద ప్రభావిత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో మైలవరం జలాశయం వద్ద అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు.

కడప జిల్లాలో భారీ వర్షాలు.. మైలవరం జలాశయం వద్ద హైఅలెర్ట్

రాయలసీమ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు తీవ్రం నష్టం వాటింల్లింది. వర్షాల నేపథ్యంలో కడప జిల్లాలో(rains updates of kadapa) నేడు కూడా విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు, కుంటలు తెగిపోయాయి. పలు గ్రామాలు, కాలనీలు నీటమునిగాయి. వరద ప్రభావిత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టాయి. కడప, చిత్తూరు, నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో సీఎం జగన్​ ఏరియల్‌ సర్వే నిర్వహించున్నారు.

కడప నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కడప ప్రకాశ్‌నగర్‌, మృత్యుంజయకుంటలో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతుంది. పట్టణంలోని నిరంజన్‌ నగర్‌, అప్సరకూడలి, ఆర్టీసీ బస్టాండ్‌లో వరద ఎక్కువగా ఉంది.

మైలవరం జలాశయం వద్ద హైఅలెర్ట్

మైలవరం జలాశయం వద్ద హైఅలెర్ట్ ప్రకటించిన(high alerts at Mylavaram reservoirs) అధికారులు. జలాశయం నుంచి పెన్నాకు 1.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. వేపరాల, దొమ్మరనంద్యాల ప్రాంతాలు, జమ్మలమడుగులోని పలు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. డ్యామ్‌ పరిసరాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

1800 బస్సు సర్వీసులను రద్దు
రాయలసీమ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 1800 బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. రాజంపేట వరద ఉద్ధృతికి మూడు బస్సులు చిక్కుకోవడంతోపాటు కండక్టర్, మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమన్నారు. చనిపోయిన కండక్టర్ కుటుంబానికి దాదాపు రూ. 50లక్షల పరిహారాలు అందిస్తామన్నారు. మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

వరదల తాకిడికి రాయలసీమ వ్యాప్తంగా దెబ్బతిన్న బస్టాండ్లు, గ్యారేజ్​ల పరిశీలనలో భాగంగా ఆయన ఇవాళ కడపకు వచ్చారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వరదలో మునిగిన కడప బస్టాండ్‌, గ్యారేజ్​ అభివృద్ధికి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. ఇకనుంచి కార్మికులకు నీటి సమస్య ఉండదని చెప్పారు.

ప్రొద్దుటూరులో పెన్నా ఉద్ధృతి..

ప్రొద్దుటూరులో పెన్నానది ఉద్ధృతంగా(heavy floods in penna rever) ప్రవహిస్తుంది. దీంతో ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు-ఎర్రగుంట్ల రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నానది నీరు.. ప్రొద్దుటూరు మదర్ థెరిస్సా వృద్ధాశ్రమంలోకి వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు ఆశ్రమంలోని వృద్ధులను రామేశ్వరం పునరావాస కేంద్రానికి తరలించారు.

చెయ్యేరు నది తగ్గుముఖం

చెయ్యేరు నదిలో వరద తగ్గుముఖం పట్టింది. వరద ప్రభావిత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టారు. గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా బృందాలు సర్వే చేయనున్నాయి.

ఇదీ చదవండి..

Buggavanka: నిండుకుండలా బుగ్గవంక..ఆందోళనలో పరిసర ప్రాంత ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.