ఏటీఎం కేంద్రాల్లో బ్యాటరీలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్

ఏటీఎం కేంద్రాల్లో బ్యాటరీలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్
Gang arrested for stealing batteries: ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో బ్యాటరీలు చోరీ చేస్తున్న ముఠాను కడప పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. రూ. 2.40 లక్షల విలువైన 49 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.
Batteries Stealing Gang Arrested: కడపలో ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో బ్యాటరీలను చోరీ చేస్తున్న దొంగలను కడప 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 2 లక్షల 40 వేల విలువైన 49 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో విద్యుత్ పనులు చేస్తున్న ముగ్గురు యువకులే ఏటీఎంలలో బ్యాటరీలను దొంగిలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిపై గతంలో 14 చోరీ కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు.
ఇటీవల కాలంలో ఈ ముగ్గురూ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లోని బ్యాటరీలను మాత్రమే చోరీ చేస్తున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా.. దొంగిలించిన బ్యాటరీలను ఆటోలో తీసుకెళ్తుండగా ముగ్గురు యువకులను పట్టుకున్నారు. విచారణలో బ్యాటరీల చోరీకి పాల్పడినట్లు తేలినట్లు డీఎస్పీ చెప్పారు.
ఇదీ చదవండి:
