Gold medals: కడప జైలు ఖైదీలకు బంగారు పతకాలు.. ఎందుకంటే..?

author img

By

Published : Aug 6, 2022, 11:20 AM IST

Updated : Aug 6, 2022, 11:47 AM IST

Gold medals to two prisoner

Gold medals to kadapa prisoners: తెలిసో తెలియకో తప్పు చేసి జైలుకు వచ్చారు. జైలుకు వచ్చినంత మాత్రాన వారు కుంగిపోలేదు.. చదవాలనే లక్ష్యం వారిని ముందుకు నడిపించింది.. జైల్లో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ చదివారు.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు.. వారి ప్రతిభకు ప్రభుత్వం బంగారు పథకాలను ప్రకటించేలా చేసుకున్నారు.

Gold medals to kadapa prisoners: అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన సురేష్​రెడ్డి 2018లో హత్య కేసులో కడప కేంద్ర కారాగారానికి వెళ్లాడు. కేంద్ర కారాగారానికి రాక మునుపే డిగ్రీ పూర్తి చేశాడు. జైలుకు వచ్చాక ఎలాగైనా విద్యను అభ్యసించాలని జైల్లో ఉన్న అంబేద్కర్ దూర విద్య ద్వారా పీజీ సోషియాలజీ తీసుకున్నాడు. కష్టపడి చదివి రెండేళ్లు పూర్తి చేసి 1000కి 738 సాధించడంతో... అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అతడికి బంగారు పతకాన్ని ప్రకటించింది.

వైయస్సార్ జిల్లా చెన్నూరుకు చెందిన రమేష్ బాబు సైతం ఓ హత్య కేసులో 2017లో కడప కేంద్ర కారాగారానికి వచ్చాడు. తను కూడా ఇది వరకే డిగ్రీ పూర్తి చేశాడు. జైలుకు వచ్చాక ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ పూర్తి చేశాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రమేష్ బాబుకు 1000కి 767 మార్కులు వచ్చాయి. ఇతనికి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బంగారు పతకాన్ని ప్రకటించింది. అయితే.. రమేష్ బాబుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్​కు వెళ్లలేకపోయాడు. సురేష్​రెడ్డి.. హైదరాబాద్​కు వెళ్లి పతకాన్ని అందుకోనున్నారు. వీరికి బంగారు పతకాలు రావడంపై జైలు అధికారులు హర్ష వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 6, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.