YCP leader Selfie Video viral: వైరల్​గా మారిన వైకాపా ఎస్సీ నాయకుడి సెల్ఫీ వీడియో

author img

By

Published : Jan 14, 2022, 3:24 PM IST

YCP leader Selfie Video goes viral

YCP leader Selfie Video goes viral : వైకాపా మీద ఉన్న అభిమానంతో 30 లక్షలు ఖర్చు పెట్టి ఆర్థికంగా ఎంతో నష్టపోయినప్పటికీ.. పార్టీలో ఎటువంటి గుర్తింపు లేదని గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు చిన్నా సెల్ఫ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

YCP leader Selfie Video goes viral : వైకాపా మీద ఉన్న అభిమానంతో 30 లక్షలు ఖర్చు పెట్టి ఆర్థికంగా ఎంతో నష్టపోయినప్పటికీ.. పార్టీలో ఎటువంటి గుర్తింపు లేదని గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు చిన్నా సెల్ఫ్ వీడియో విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పార్టీ కోసం 10సంవత్సరాలు కష్టపడినప్పటికి ప్రజాప్రతినిధులు, కింది స్థాయి కార్యకర్తలని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వంలో అన్ని కులాలు నష్టపోయాయని వాపోయారు. మూడు రాజధానులుకి సైతం మద్దతుగా దీక్షలు, ర్యాలీలు చేసినా ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీని నమ్ముకున్న వారి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ గా మారిన వైకాపా ఎస్సీ నాయకుడి సెల్ఫీ వీడియో...

ఇదీ చదవండి : Murder: కర్రలతో కొట్టి వ్యక్తి దారుణ హత్య.. కారణమేంటంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.