TOP NEWS: ప్రధాన వార్తలు @7PM

author img

By

Published : Nov 25, 2021, 6:58 PM IST

TOP NEWS @7PM

.

  • కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై హైకోర్టులో విచారణ
    కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై(Kondapalli municipal chairman) హైకోర్టులో విచారణ జరిగింది. తన ఎక్స్‌అఫిషియో ఓటుపై ఎంపీ కేశినేని నాని పిటిషన్ వేశారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పేదలకు ఇళ్ల పథకంపై.. అప్పీలుకు వెళ్లిన ప్రభుత్వం
    పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా.. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టవద్దని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై.. రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్​కు అప్పీల్ చేసింది. ఈ అప్పీల్​పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Yanamala Fire On Govt: రేపు ఆ విద్యార్థులకే రీయింబర్స్​మెంట్ అంటారేమో..!: యనమల
    'నేడు మద్యం తాగితేనే అమ్మఒడి అంటున్నారు..రేపు గంజాయి అమ్మిన విద్యార్థులకే రీయింబర్స్​మెంట్ అంటారేమో' అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. మద్యం తాగితేనే సంక్షేమం అనే దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని యనమల విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Man Missing In Kadapa Flood : నా భర్త జాడేది..??
    కడప జిల్లాలో వారం రోజుల కిందట సంభవించిన వరదల్లో అనేక మంది గల్లంతయ్యారు. పలువురు మృత్యువాత పడ్డారు. రాజంపేటకు చెందిన శివ ప్రసాద్ అనే వ్యక్తి నందలూరు వద్ద బస్సులో ప్రయాణిస్తూ వరదల్లో గల్లంతయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తృణమూల్.. ఆల్ ఇండియా 'కాంగ్రెస్' అవుతోందా?
    బంగాల్​ ఎన్నికల్లో మోదీ, షా ద్వయాన్ని ఒంటిచేత్తో ఎదుర్కొని విజయదుందుబి మోగించిన మమతా బెనర్జీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు రాష్ట్రల కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనాకు ఝలక్​.. ఆ ఎన్నికల్లో భారత్​కు జైకొట్టిన ప్రపంచ దేశాలు
    Interpol Election 2021: భారత్​ నుంచి ప్రవీణ్​ సిన్హా అనే అధికారి ఇంటర్​పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా నుంచి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో స్పెషల్​ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
    దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. వైద్యులు కరోనా కొత్త రకాన్ని కనుగొన్నట్లు ఏఎఫ్​పీ మీడియా ఏజెన్సీ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీకాలు కొనేందుకు భారత్​కు ఏడీబీ రూ.11 వేల కోట్ల రుణం
    adb loan to india for covid-19: టీకాల కొనుగోలు కోసం భారత్​కు ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.11,185 కోట్ల రుణాన్ని ఆమోదించింది. భవిష్యత్​లో వైరస్​ వ్యాప్తి నుంచి భారత్​ తమ పౌరులను రక్షించుకోవడానికి ఈ నిధి​ ఉపయోగపడనుందని ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IND Vs NZ: శ్రేయస్​ ధనాధన్​ ఇన్నింగ్స్​.. టీమ్​ఇండియా 258/4
    తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్​ అయ్యర్​ (75), రవిచంద్రన్​ అశ్విన్​(50) ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Cinema news: 'శ్యామ్​సింగరాయ్' మెలోడీ.. 'శేఖర్' గ్లింప్స్
    సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్యామ్​సింగరాయ్, శేఖర్, ఫ్లాష్​బ్యాక్, బేడీయా చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.