Dachepalli Police Saved Woman: బావిలో దూకిన వృద్ధురాలు..కాపాడిన పోలీసులు

author img

By

Published : Nov 27, 2021, 2:28 PM IST

Dachepalli Police saved an old lady

పిల్లలు, మనుమరాళ్లు, మనవళ్లతో హాయిగా జీవితంలో తుది దశ గడపాలని అందరిలాగే ఆ వృద్ధురాలు కూడా అనుకుంది. కానీ కొడుకులు పట్టించుకోకపోవడంతో జీవితం మీద విరక్తి (An old lady Jumped in well and tried to commit suicide) చెందింది. బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగింది.

గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు వృత్తి ధర్మంతో పాటు మానవత్వం చాటుకున్నారు. రామాపురంలో నివాసం ఉండే ఓ వృద్ధురాలు..తనను కొడుకులు పట్టించుకోవడం లేదని విరక్తి చెందింది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక.. దగ్గరలో ఉన్న బావిలోకి (An old lady Jumped in well and tried to commit suicide) దూకింది. బామ్మ చేసిన పనిని గమనించిన స్థానికులు దాచేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్సై సుధీర్, తన సిబ్బందితో కలిసి బావిలోకి దిగి వృద్ధురాలిని(Dachepalli police saved old lady) కాపాడారు.

వృద్ధురాలి చేయి విరగడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి108 సిబ్బందితో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాన్ని కాపాడిన పోలీసులను గ్రామస్థులు చప్పట్లతో(Villagers appreciated police) అభినందించారు.

ఇదీ చదవండి :

"బాటిళ్లన్నీ అమ్మారా.. ఏమైనా మింగేశారా?" మద్యం దుకాణాల్లో సర్కారు ఆడిట్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.