రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఎ అభ్యర్ధికి మద్దతివ్వాలని వైకాపా నిర్ణయం

author img

By

Published : Jun 23, 2022, 10:16 PM IST

Updated : Jun 23, 2022, 10:51 PM IST

YSRCP support to NDA candidate

22:14 June 23

ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని వైకాపా నిర్ణయం

ysrcp support to draupadi murmur: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై వైకాపా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని ఆ పార్టీ పేర్కొంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది.

మంత్రివర్గ సమావేశం ఉన్నందున సీఎం జగన్‌ దిల్లీకి వెళ్లడం లేదని.. శుక్రవారం జరగబోయే ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి తమ పార్లమెంటరీ పార్టీ నేత, లోక్‌సభాపక్ష నేత హాజరవుతారని వెల్లడించింది. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్న విషయం తెలిసిందే.

ఇదీచదవండి:

Last Updated :Jun 23, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.