SHARMILA: నేటి నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం.. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం

author img

By

Published : Oct 20, 2021, 6:40 AM IST

చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం

వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల.. ఇవాళ తెలంగాణలోని చేవేళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రను చేపట్టనున్నారు. శంకర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారు. అభిమానులు, ప్రజలు ఆదరించాలని షర్మిల కోరారు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల... ప్రజా ప్రస్థానం ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించి మళ్లీ అక్కడే ముగిస్తారు. హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు అనుగుణంగా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.

తొలిరోజు...

ప్రజాప్రస్థానంలో భాగంగా తొలిరోజు చేవేళ్ల నుంచి రెండున్నర కిలోమీటర్లు నడిచి... మధ్నాహ్నం 12. 30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. అనంతరం కందవాడ గేట్ క్రాస్ వద్ద భోజనం చేసి విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి చేరుకుంటారు. మొత్తం 10కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.

వైఎస్సార్​ పాలన కోసమే..

తెలంగాణలో మళ్లీ వైఎస్సార్​ సంక్షేమ పాలన తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేపడుతున్నానని షర్మిల స్పష్టం చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి వైఎస్సార్ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలో ప్రతి గడప తొక్కి ప్రజల కష్టాలు తెలుసుకుని వారి పక్షాన పోరాడతమని షర్మిల వెల్లడించారు. వైఎస్సార్ అభిమానులు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

యథావిధిగా నిరుద్యోగ దీక్ష

పాదయాత్ర చేస్తున్నప్పటికీ... ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష యథావిధిగా కొనసాగించనున్నారు. ఎక్కడ పాదయాత్రలో ఉంటే అక్కడే దీక్షను కొనసాగిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

ఇదీ చూడండి: YCP ATTACK TDP: YCP ATTACK: తెదేపా కేంద్ర కార్యాలయంలో అల్లరి మూకల విధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.