ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు.. తన పదవికి యార్లగడ్డ రాజీనామా

author img

By

Published : Sep 21, 2022, 1:35 PM IST

YARLAGADDA LAXMIPRASAD

YARLAGADDA LAXMIPRASAD : ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ.. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదన్నారు. మహానుభావుడి పేరు ఆరోగ్య వర్సిటీకి ఉంచాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.

YARLAGADDA : ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పును నిరసిస్తూ.. ప్రభుత్వం తనకు కల్పించిన హోదాలకు రాజీనామా చేస్తున్నట్లు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రకటించారు. హిందీ అకాడమీ, తెలుగు అధికార భాషా సంఘం, తెలుగు ప్రాధికార సంఘానికి అధ్యక్షునిగా ఉన్న ఈ మూడు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదన్నారు. మహానుభావుడి పేరు ఆరోగ్య వర్సిటీకి ఉంచాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.

"నా పదవికి రాజీనామా చేస్తున్న. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదు. వర్సిటీ పేరు మార్పు బాధ కలిగించింది. వైఎస్సార్‌ ఆత్మ కూడా శాంతించదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం నాకు నచ్చలేదు."

-యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.