ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Dec 5, 2021, 1:00 PM IST

ప్రధాన వార్తలు @ 1PM

.

  • weather updates: సాయంత్రానికి అల్పపీడనంగా మారనున్న వాయుగుండం!

weather updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశా కదులుతోందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. వాయుగుండం సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Sea Came Farward in Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం

Visaka RK beach: విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద సముద్రం ముందుకొచ్చింది. అలల తాకిడికి భూమి మొత్తం బీటలు వారింది. ఆర్కే బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. అలాగే పిల్లల పార్కులో అడుగు మేర, సమీపంలో పది అడుగుల మేర భూమి కుంగిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Farmers padayatra: పుట్టంరాజు వారి కండ్రిగ నుంచి ప్రారంభమైన రాజధాని రైతుల పాదయాత్ర..

నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహాపాదయాత్ర 35వ రోజు కొనసాగుతోంది. జిల్లాలోని వారి కండ్రిగ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. రాత్రికి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకుని అక్కడే బస చేయనున్నారు. రైతుల పాదయాత్రలో పాల్గొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వారికి సంఘీభావం తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మంచిగా బతకమంటే.. మాటు వేసి హత్య చేశాడు.. ఆపై!

డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Misfire on Civilians: బలగాల తప్పిదం.. 11 మంది పౌరులు మృతి!

నాగాలాండ్​లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మిలిటెంట్లుగా భావించి పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Omicron Delhi: భారత్​లో ఐదో ఒమిక్రాన్​ కేసు- దిల్లీలో ఒకరికి నిర్ధరణ

Omicron Delhi: భారత్​లో మరో ఒమిక్రాన్​ కేసు నమోదైంది. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తి ఈ వేరియంట్ బారినపడినట్లు తేలింది. ఇది దేశంలోనే ఐదో ఒమిక్రాన్ కేసు కావడం గమనార్హం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Sabarimala Rush: శబరిమలలో భక్తుల రద్దీ- ఒక్కరోజే 42 వేల మంది..

Sabarimala Rush Today: శబరిమలలో భక్తులరద్దీ కొనసాగుతోంది. శనివారం రికార్డు స్థాయిలో 42వేలమందికి పైగా భక్తులు దర్శనానికి వచ్చారు. డిసెంబరు 26 వరకు ఆలయం తెరిచే ఉంటుందని రాష్ట్రప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Volcano eruption: పేలిన అగ్ని పర్వతం- 13 మంది మృతి

Indonesia volcano eruption: ఇండోనేసియా జావాలోని మౌంట్ సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. పెద్ద ఎత్తున లావా విరజిమ్మగా సమీప గ్రామాలపై బూడిద పేరుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Ind Vs Nz: లంచ్ విరామం.. భారీ ఆధిక్యంలో టీమ్​ఇండియా

Team india vs New zealand 2021:న్యూజిలాండ్​తో రెండో టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్​ పూర్తయ్యేసరికి టీమ్​ఇండియా రెండో ఇన్నింగ్స్​లో 142/2 పరుగుల నిలిచింది. క్రీజులో గిల్, కోహ్లీ ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Anasuya Father died: అనసూయ ఇంట్లో విషాదం

Anasuya Father died: వ్యాఖ్యాత, సినీ నటి అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన రావు(63) కన్నుమూశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.