TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Nov 22, 2021, 2:59 PM IST

Topnews

.

  • high court on three capitals cases: 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి - హైకోర్టు
    అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • AP repeals 3 Capitals Act: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు: అమరావతి ఐకాస
    మూడు రాజధానులు బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Peddireddy on 3 capitals repeal bill: చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి
    ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని.. చట్టం ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • cm jagan review on floods : వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్​ సమీక్ష
    వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో(cm jagan review on floods affected districts) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్​ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వర్ష బీభత్సానికి 24 మంది బలి- 5 లక్షల ఎకరాల పంట నష్టం
    కర్ణాటకలో కుండపోత వర్షాలతో (Heavy rains in karnataka) ఇప్పటివరకు 24 మంది మృతిచెందినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. 5 లక్షల ఎకరాలకుపైగా పంటదెబ్బతిన్నట్లు పేర్కొంది. మరోవైపు.. బెంగళూరు జలదిగ్భందం అయింది. ఎటు చూసినా వరదనీటితో నిండిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నవ్వుల నిరసన.. రోడ్డు కోసం స్థానికుల వింత ఆందోళన
    వర్షాలు, భారీ వాహనాల రాకపోకలతో రహదారి ధ్వంసమైంది. అధికారుల చుట్టూ తిరిగితే రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి. రెండేళ్లు గడిచినా నిర్మాణం మాత్రం చేపట్టలేదు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ వాసులు 200 మీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా నిలబడి పెద్ద పెట్టున్న నవ్వుతూ నిరసన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • లక్షల కొద్దీ ఎర్ర పీతలు.. దారి మొత్తం అవే..
    ఆస్ట్రేలియాలోని 'క్రిస్మస్‌ ఐలాండ్‌' అనే ప్రాంతం ఎర్రని పీతలతో నిండిపోయింది. ప్రతి ఏడాదిలాగే సముద్రంలోకి వలస వెళుతున్న లక్షలాది పీతలతో ఆ ప్రాంతమంతా ఎర్రగా మారింది. చంద్రుని వేగాన్ని బట్టి ఎర్రపీతల కదలిక ఆధారపడి ఉంటుందని నేషనల్ పార్క్‌ ఉద్యోగులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఎయిర్​టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలు పెంపు.. కొత్త ధరలివే
    ప్రీపెయిడ్​ రీఛార్జ్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్​టెల్​ (airtel recharge) తెలిపింది. అన్ని ప్లాన్​ల​పై 20-25 శాతం ధరలు పెంచినట్లు పేర్కొంది. కొత్త రీఛార్జ్​ ధరలు నవంబరు 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Rohit Sharma: ధోనీ, కోహ్లీల సంప్రదాయాన్ని కొనసాగించిన రోహిత్
    కెప్టెన్​గా తొలి సిరీస్​లోనే టీమ్​ఇండియాకు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ (Rohit Sharma). న్యూజిలాండ్​పై మూడో టీ20లో గెలిచి ట్రోఫీ అందుకున్న అనంతరం.. దాన్ని తీసుకెళ్లి నేరుగా కొత్త ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్‌, హర్షల్ పటేల్‌కు అందజేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • దూసుకుపోతున్న 'అఖండ' ట్రైలర్​.. 'మైఖేల్​'లో గౌతమ్ మేనన్
    సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అఖండ, మైఖేల్, శేఖర్, క్యాలీఫ్లవర్, బ్రో చిత్రాలకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి. *నందమూరి బాలకృష్ణ 'అఖండ' ట్రైలర్​ యూట్యూబ్​లో దూసుకుపోతుంది. ప్రస్తుతం 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.