TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 PM

author img

By

Published : Oct 19, 2021, 9:00 PM IST

ప్రధాన వార్తలు @ 9pm

.

  • వైకాపా దాడులు.. రేపు రాష్ట్రవ్యాప్త బంద్​కు తెదేపా పిలుపు
    తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను తీవ్రంగా ఖండించింది తెలుగుదేశం పార్టీ. ఇందుకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్​కు పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి జగన్, డీజీపీ కలిసే ఈ దాడి చేయించారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • CBN On Attacks: 'ఆ ఇద్దరి ప్రమేయంతోనే దాడులు': చంద్రబాబు
    తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. దాడుల విషయంలో పోలీసులు, సీఎం జగన్ లాలూచీపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రమేయంతోనే తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరిగాయన్నారు. పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిదని..,పార్టీ కార్యాలయాలపై దాడులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడులు..ఉద్రిక్తత
    సీఎం జగన్‌పై తెదేపా నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు దిగారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • గవర్నర్‌కు చంద్రబాబు ఫోన్‌.. వైకాపా దాడులపై ఫిర్యాదు
    రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పాండోరా పేపర్స్​పై దర్యాప్తు షురూ.. రంగంలోకి ఆర్​బీఐ, ఈడీ
    అక్టోబర్ 3న విడుదలైన పాండోరా పేపర్లపై దేశంలో విచారణ ప్రారంభమైంది. ఆర్​బీఐ, ఈడీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సహా.. పలు విభాగాల అధికారులతో కూడిన మల్టీ ఏజెన్సీ గ్రూప్ దీనిపై దర్యాప్తు చేపట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కశ్మీర్​లో పౌరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు
    జమ్ముకశ్మీర్​లో స్థానికేతరుల హత్యలపై ఎన్​ఐఏ దర్యాప్తు చేపట్టనుంది(jammu kashmir news). హోంశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే రంగంలోకి దిగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఉత్తరాఖండ్​లో వరుణుడి బీభత్సం- 44కు చేరిన మృతులు
    ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో(Uttarakhand Rain News) ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణికిపోతోంది. వర్షాల కారణంగా ఇప్పటివరకు వివిధ ఘటనల్లో 44 మంది చనిపోయారు. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చేసిన ప్రకటన కాస్త ఊరట కలిగిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అమెరికా కోర్టులో నీరవ్​ మోదీకి చుక్కెదురు
    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి అమెరికా​ కోర్టులో చుక్కెదురైంది. తమపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలని నీరవ్ మోదీతో పాటు ఆయన సహచరులు చేసిన పిటిషన్​ను కోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'టీమ్​ఇండియాకు పొగమంచు గండం.. ఎదుర్కొనేందుకు సిద్ధం'
    టీ20 ప్రపంచకప్​లో పొగమంచు సమయంలోనూ ఎవరైతే గొప్పగా బౌలింగ్ చేయగలరో వారికే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు టీమ్ ఇండియా కోచ్​ రవిశాస్తి. ఈ సీజన్​లో టీమ్​ఇండియా అన్ని మ్యాచ్​లు దాదాపు సాయంత్రం సమయంలోనే అడనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పవన్​ కల్యాణ్​తో మంచు విష్ణు.. ఆ వార్తలకు చెక్!
    ఇటీవల హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'అలయ్‌ బలయ్‌'(alai balai 2021) కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(pawan kalyan alai balai dattatreya), మంచు విష్ణు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై పక్కపక్కనే ఉన్నా విష్ణుతో మాట్లాడటానికి పవన్ సుముఖత వ్యక్తం చేయలేదని పలు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు విష్ణు. ఇందులో పవన్, విష్ణు మాట్లాడుకుంటూ కనిపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.