TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Aug 4, 2022, 5:00 PM IST

TOP NEWS

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM

  • పరిశ్రమల్లో.. ఆ పని ఖచ్చితంగా చేపట్టాలి: పవన్​
    PAWAN ON SEZ INCIDENT: అచ్యుతాపురం సెజ్‌లో తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లిప్తతే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఎప్పుడు, ఏ ప్రమాదం సంభవిస్తుందోనని.. ఏ విషవాయువు ప్రాణాలు తీస్తుందోనని భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Death: బాయిలర్​ శుభ్రం చేస్తుండగా తీవ్ర అస్వస్థత.. ఇద్దరు మృతి
    Two People died: మొక్కజొన్న పరిశ్రమలో బాయిలర్​ శుభ్రం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అభివృద్ధి కార్పొరేషన్‌ కాదు.. అప్పుల కార్పొరేషన్‌: నాదెండ్ల
    NADENDLA: రాష్ట్రాభివృద్ధి కోసమంటూ ఏపీ అభివృద్ధి కార్పొరేషన్ స్థాపించి.. 23వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. అందులో రూ.16వేల కోట్లను సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశారని.. మిగతా వాటిని దేనికోసం వినియోగించారో చెప్పాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • AP high court shift: కర్నూలుకు ఏపీ హైకోర్టు మార్పుపై.. కేంద్రం కీలక ప్రకటన
    AP high court shift: ఏపీ హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదని కేంద్రం తెల్చి చెప్పింది. అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదన పెండింగ్‌లో లేదని స్పష్టం చేసింది. 2019 జనవరిలో రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని తెలిపింది. ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ని విభజన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేశారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మోదీకి, ఈడీకి భయపడను'.. కేంద్రంపై రాహుల్ ఫైర్​.. ఖర్గేకు సమన్లు
    National herald case: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. మోదీకి, ఈడీకి తాను భయపడబోనని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేసింది. దీనిపై పార్లమెంట్​ సెషన్​ జరుగుతున్నప్పుడు సమన్లు పంపండం ఏంటని ఆయన ప్రశ్నించగా.. కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ కౌంటర్​ వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ.1400 కోట్ల 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ సీజ్.. కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్
    Meow Meow drug Mumbai: అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ముంబయి యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. రూ.1400 కోట్లు విలువైన మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు, కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తైవాన్​ను చుట్టుముట్టిన చైనా.. భారీ ఎత్తున సైనిక డ్రిల్స్.. యుద్ధం తప్పదా?
    China drills Taiwan: తైవాన్​ను తనలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తున్న చైనా.. తాజాగా ఆ దేశం చుట్టూ భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టింది. చైనా సైన్యం, వైమానికదళం, నౌకాదళం, వివిధ అనుబంధ బలగాలు సంయుక్తంగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ.619 పెట్టుబడికి రూ.2లక్షల లాభం.. ఈ షేరు ఐపీఓ సూపర్​హిట్!
    AMTD digital share returns: బుల్ మార్కెట్లోనూ సాధ్యంకాని అనూహ్య పరిణామం జరిగింది. ఐపీఓలో ఓ షేరు దుమ్మురేపింది. మదుపర్లకు 32,660శాతం రాబడినిచ్చింది. రూ.619 పెట్టుబడి పెడితే.. ఒక్కో షేరుపై రూ.2లక్షలకు పైగా లాభం వచ్చింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ రికార్డు స్థాయి ట్రేడింగ్ నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND Vs WI: చివరి రెండు టీ20లు అక్కడే.. ఆటగాళ్లకు వీసాలు వచ్చేశాయ్​
    IND VS WI T20 Series: విండీస్​-భారత్​ ఐదు టీ20ల సిరీస్​లో భాగంగా చివర రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో యథావిధిగా జరుగుతాయని విండీస్ క్రికెట్​ బోర్డు వెల్లడించింది. గురువారం ఆటగాళ్లకు యూఎస్‌ వీసాలు మంజూరు కావడంతో ఆఖరి రెండు టీ20లను అక్కడే నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మరో పది రోజుల్లో ప్రాబ్లమ్స్ క్లియర్​​.. కాస్త వెయిట్​ చేయండి!'
    కరోనా తర్వాత నిర్మాతలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు షూటింగ్స్​ను నిలిపివేసినట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ స్పష్టం చేశారు. మరో పది రోజుల్లో సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని, నిర్మాతలెవరూ బయట జరిగే ప్రచారాన్ని నమ్మ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్మాతలంతా కలిసి తనకు ఎక్కువ బాధ్యతలు అప్పగించారని, ఇందులో తన వ్యక్తిగత ఏజెండా ఏమీ లేదని దిల్​రాజు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.