TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : Aug 3, 2022, 9:04 AM IST

9

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM

  • ‘ఉపాధి నిధుల’ దుర్వినియోగం కేసులు ఏపీలోనే అధికం
    AP IN PARLIMENT: ఉపాధి హామీ(employment funds) నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. ఈ ఏడాది జులై 30 నాటికి 1,59,570 కేసులు నమోదైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన జ్యోతి మంగళవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • AP LOANS: వ్యవసాయ రుణాల్లో ఏపీది రెండో స్థానం.. తమిళనాడు ప్రథమం
    AP AGRICULTURE LOANS:వ్యవసాయ రుణాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో( Andhra Pradesh in second place ) రెండో స్థానంలో నిలిచింది. 2022 మార్చి 31 నాటికి ఏపీ వ్యవసాయ రుణాలు రూ.1.92 లక్షల కోట్లకు చేరాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలను ఉత్తర, ఈశాన్య, తూర్పు, కేంద్ర, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలుగా విభజించి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ(agriculture loans) రుణాలను లెక్కించింది. అందులో 8 రాష్ట్రాల సమాహారమైన ఉత్తర ప్రాంతంలో మొత్తం కలిపి రూ.2.83 లక్షల కోట్ల రుణాలు ఉంటే.. దక్షిణాది రాష్ట్రాల్లోని ఒక్క తమిళనాడులోనే రూ.2.78 లక్షల కోట్లు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • HIGH COURT: రుషికొండ పనుల పరిశీలనకు వెళ్లిన న్యాయవాదిపై కేసు.. హైకోర్టు ‘స్టే’
    HIGH COURT: విశాఖలోని రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ నిర్మాణం పనులను పరిశీలించడానికి వెళ్లిన సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తిపై పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టు తదుపరి చర్యలన్నింటిని నిలిపేసింది. ఆరిలోవ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కేఎస్‌ మూర్తి మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేడే ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ఏర్పాట్లు
    Umamaheswari Funerals: దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి అంత్యక్రియలను నేడు మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు ఎన్టీ రామారావు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఆమె భర్తతో కలిసి ఉంటున్నారు. ఆమె వచ్చేవరకు అంత్యక్రియలు ఆపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నేటి ఉదయం విశాల నగరానికి వచ్చేస్తారని ఆ తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 15 ఏళ్లకు నరకకూపంలోకి.. 4 నెలల్లో మూడు సార్లు అమ్ముడుపోయి...
    15 ఏళ్ల వయసులో ఓ వ్యక్తితో ప్రేమలో పడి కన్నవారిని, ఇంటిని వదిలి అతడి దగ్గరకు వెళ్లింది. ఆ మోసగాడు ఆమెను వస్తువులా అమ్మేయడం వల్ల మానవ అక్రమరవాణా ముఠాకు చిక్కి నాలుగు నెల్లలో మూడు సార్లు అమ్ముడుపోయింది. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకం అనుభవించింది. ఎంతో మంది అకృత్యాలకు బలైంది. చివరకు ఏమైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భూగర్భ జలాలు విషపూరితం.. కేంద్రం షాకింగ్ కామెంట్స్​..!
    Ground water: భూగర్భజలాల కాలుష్యం గురించి పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ జలాల నాణ్యత క్షీణిస్తోందని రాజ్యసభలో కేంద్రం అంగీకరించింది. గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం మనం తాగుతున్న నీరు విషపూరితమని, దాదాపు అన్ని రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో భూగర్భ జలాల్లో విషపూరిత లోహాలున్నాయని వెల్లడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పుంజుకున్న రిషి.. ట్రస్​కు గట్టి పోటీ.. తాజా సర్వే ఫలితం ఇదే!
    బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ల మధ్య నడుస్తున్న పోరు రసవత్తరంగా మారింది. రేసులో భారత సంతతి నేత రిషి పుంజుకున్నారు. గత వారం ఇటలీకి చెందిన ప్రజా వ్యవహారాల కంపెనీ టెక్నీ నిర్వహించిన పోల్‌లో ఇద్దరు నేతల మధ్య కేవలం 5 శాతం మాత్రమే తేడా ఉంది. ఇది సునాక్‌కు ఊరటనిచ్చే అంశమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రికవరీ.. ఇష్టం వచ్చినట్లు కుదరదు.. ఆ సమయంలోనే సంప్రదించాలి
    LOAN RECOVERY: రుణం తీసుకునే వారు, చెల్లించాల్సిన బాధ్యతను మరువకూడదని.. రుణమొత్తాన్ని ఖాతాదార్ల నుంచి వసూలు చేసుకోవాల్సిన రికవరీ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి.. కానీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే, వారే ఇబ్బంది పడాల్సి వస్తుంద’ని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఒకే ఓవర్‌లో 6 6 6 6 4 6.. అదరగొట్టిన జింబాబ్వే బ్యాటర్​
    Ryan Burl: జింబాబ్వే బ్యాటర్​ ర్యాన్ బర్ల్ అదిరిపోయే రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్​లో ఐదు సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్​తో జరిగిన మూడో టీ20 మ్యాచ్​లో ర్యాన్ బర్ల్ ఈ ఘనత సాధించాడు. మరోవైపు ఈ మ్యాచ్​లో జింబాబ్వే.. బంగ్లాదేశ్​పై గెలిచి సిరీస్ నెగ్గింది​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'టైగర్​ నాగేశ్వరరావు'లో బాలీవుడ్​ స్టార్.. స్పీడ్​ పెంచనున్న ఎన్టీఆర్​!
    రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ మూవీలో ఓ కీలక పాత్రను ప్రముఖ బాలీవుడ్​ నటుడు అనుపమ్​ ఖేర్​ పోషించనున్నారు. మరోవైపు, హీరో జూ.ఎన్టీఆర్​.. ఇక నుంచి వేగం పెంచి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.