TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Jul 31, 2022, 6:59 PM IST

TOP NEWS

TOP NEWS: ప్రధాన వార్తలు@7PM

  • వరద బాధితులకు సాయం పెంచాలి.. సీఎస్​కు చంద్రబాబు లేఖ
    Chandrababu letter to CS: గోదావరి వరద బాధితుల కష్టాలు, పోలవరం నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గోదావరి వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయని.. ఇళ్లు మునిగిపోయి, కూలిపోయి భారీ నష్టం జరిగిందన్న చంద్రబాబు.. ప్రభుత్వ సాయం పెంచాలని లేఖలో కోరారు. పోలవరం నిర్వాసితులకు దశల వారీ పరిహారం అనే విధానాన్ని పక్కనపెట్టి.. అందరికీ ఒకేసారి పరిహారం ఇవ్వాలని తేల్చిచెప్పారు. పోలవరం కోసం తమ భూములు, ఊళ్లు ఇచ్చి త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Amaravati Farmers: భాజపా నేతలకు అమరావతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?: రాజధాని రైతులు
    Amaravati Farmers: అమరావతిలో పాదయాత్ర చేస్తున్న భాజపా నేతలకు నిరసన సెగ తగిలింది. జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మందడం దీక్షా శిబిరంలో మాట్లాడుతుండగా అమరావతి రైతులు అడ్డుకున్నారు. భాజపాకు అమరావతి ఇప్పుడు గుర్తుకువచ్చిందా అని.. రైతులపై కేసులు పెట్టినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ మాటలు వినే తాము భూములిచ్చామని రైతులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • BAR LICENSE: కొనసాగుతున్న బార్ల ఈ-వేలం... ధరలు చూస్తే..
    BAR LICENSE: రాష్ట్రంలో మూడు సంవత్సరాల పాటు బార్​ లైసెన్స్​ల కోసం నిర్వహిస్తున్న ఈ-వేలం పలు జిల్లాలో ముగిసింది. ఇప్పటివరకు కృష్ణా, ఎన్టీఆర్​ జిల్లాలో పూర్తవగా.. కృష్ణా జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.30.07 కోట్ల ఆదాయం సమకూరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సారీ అమ్మ, నాన్న.. అతడ్ని ప్రేమించా.. ఇక నా వల్ల కాదు'.. యువకుడి సూసైడ్ లెటర్
    రాజస్థాన్​లోని కోటాలో స్వలింగ సంపర్క సమస్యలతో 16ఏళ్ల యవకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు.. స్నానం కోసం కుంటలో దిగిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి మరణించారు. ఈ దారుణ ఘటన అదే రాష్ట్రంలోని శ్రీగంగానగర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'హక్కులు, విధులపై అవగాహనతోనే రాజ్యాంగబద్ధ అభివృద్ధి'
    CJI NV Ramana Speech: హక్కులు, విధుల గురించి పౌరులు తెలుసుకుంటేనే రాజ్యాంగబద్ధ గణతంత్రం అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజ్యాంగ నిబంధనలను ప్రజలకు సరళంగా వివరించాలని సూచించారు. సామాజిక మార్పునకు చట్టాన్ని సాధనంగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శివసేన నేత సంజయ్​ రౌత్​ను అదుపులోకి తీసుకున్న ఈడీ
    శివసేన సీనియర్‌ నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మరింత లోతైన విచారణ కోసం రౌత్​ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్‌ ఇంటికి చేరుకుంది. పాత్రచాల్ ​భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భగభగ మండుతూ.. భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్​ శకలాలు
    China Rocket Crash: ప్రపంచ దేశాలకు చైనా ఏదో ఒక రూపంలో సమస్యలు సృష్టిస్తూనే ఉంది. కరోనా పుట్టుకకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న డ్రాగన్ దేశం.. ఇటీవల లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ వైఫల్యంతో కొత్త చిక్కులు తీసుకొచ్చింది. చైనా రాకెట్‌ శకలాలు భగభగ మండుతూ శనివారం అర్ధరాత్రి భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. నాసా సహా అంతరిక్ష శాస్త్ర నిపుణులను ఆందోళనకు గురిచేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భయం వద్దు.. మన విమానాల్లో ప్రయాణం సురక్షితం!'
    Airline safety India : భారత విమానయాన రంగం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు డీజీసీఏ సారథి అరుణ్ కుమార్. స్పైస్​జెట్ సహా కొన్ని దేశీయ సంస్థల విమానాల్లో ఇటీవల సమస్యలు తలెత్తినా.. అవి ఆందోళన చెందాల్సినంత తీవ్రమైనవి కాదని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వెయిట్​లిఫ్టింగ్​లో మరో పసిడి.. 300కేజీలు ఎత్తిన 19ఏళ్ల యువ జవాన్
    Commonwealth games Jeremy Won Gold Medal: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. వెయిట్‌లిఫ్టింగ్‌ 67 కిలోల కేటగిరీలో జెరెమీ లాల్​రిన్నుంగా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'బాలీవుడ్ పని అయిపోలే.. ముందుంది అసలు పండగ!'.. కరణ్ జోహర్ షాకింగ్​ కామెంట్స్​
    బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయిదంటూ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న వార్తలపై నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. అవి కేవలం పనికిరాని మాటలు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడమనేది పెద్ద సవాలుగా మారిందని.. కానీ మంచి చిత్రాలు మాత్రం ఎప్పటికీ హిట్ అవుతాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.