TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Jul 31, 2022, 3:00 PM IST

3PM

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM

  • ఆగస్టు 15న.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
    KISHAN REDDY: 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా.. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. "హర్ ఘర్ తిరంగా" కార్యక్రమాన్ని విజయవంతం చేసి.. జాతీయ పతాకం స్ఫూర్తిని బలంగా చాటాలన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేళ.. ఆగస్టు రెండో తేదీన దిల్లీ వేదికగా పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆలయ అర్చకుడి వినూత్న నిరసన.. ఆలయ గోపురం పైకి ఎక్కి ధర్నా
    PRIEST PROTEST: ఎవరైనా ధర్నాలు, నిరసనలు, బైఠాయింపులు రోడ్లపై కానీ, ధర్నాచౌక్​ల దగ్గర లేదా ఇంటి ముందు చేయడం చూశాము. నాయకులు, కార్యకర్తలు అయితే పార్టీ ఆఫీస్​ల ముందు నిరసనలు చేస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఆలయ గోపురంపై ధర్నా చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తిని చూసి మీరు ఎవరో అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే అతను ఎవరో కాదు.. స్వయానా ఆలయ అర్చకుడు. మరి ఆయన ఎందుకు నిరసన చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కథనం మీ కోసమే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • CWC visits Polavaram: పోలవరంలో.. సీడబ్ల్యూసీ బృందం..
    CWC team visits Polavaram: పోలవరం ప్రాజెక్టును సీడబ్ల్యూసీ బృందం సందర్శించింది. వరదల తర్వాత సీడబ్ల్యూసీ బృందం సభ్యులు ప్రాజెక్టు పరిస్థితిపై వివరాలు సేకరించారు. అనంతరం ప్రాజెక్టు పరిస్థితిపై సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Road accident: ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ.. ఇద్దరు మృతి
    Road accident: రాష్ట్రంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కడప శివారులోని ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ద్వితీయ శ్రేణి పౌరులుగా మైనారిటీలు! అలా చేస్తే దేశ విభజన ముప్పు!'
    Raghuram rajan news: భారత ఆర్థిక పురోగతిపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, అందులోని సంస్థల్ని బలోపేతం చేయడంలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూపించే ప్రయత్నం చేస్తే అది దేశాన్నే విభజిస్తుందని ఆయన విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమ్మకు అదిరే 'రిటైర్​మెంట్​' గిఫ్ట్​.. హెలికాప్టర్​లో ఇంటికి..
    సాధారణంగా తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పదవీవిరమణ పొందిన రోజు.. రకారకాల కానుకలు ఇస్తుంటారు పిల్లలు. బంగారం, బట్టలు, మొబైల్స్​ వంటి వాటిని తమ గుర్తుగా అందిస్తుంటారు కుమారులు, కుమార్తెలు. కానీ రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన తల్లి రిటైర్మ్​మెంట్​ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గిఫ్ట్​ ఇచ్చాడు. హెలికాప్టర్​లో తిప్పి.. ఇంటికి తీసుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భగభగ మండుతూ.. భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్​ శకలాలు
    China Rocket Crash: ప్రపంచ దేశాలకు చైనా ఏదో ఒక రూపంలో సమస్యలు సృష్టిస్తూనే ఉంది. కరోనా పుట్టుకకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న డ్రాగన్ దేశం.. ఇటీవల లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ వైఫల్యంతో కొత్త చిక్కులు తీసుకొచ్చింది. చైనా రాకెట్‌ శకలాలు భగభగ మండుతూ శనివారం అర్ధరాత్రి భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. నాసా సహా అంతరిక్ష శాస్త్ర నిపుణులను ఆందోళనకు గురిచేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? ఇలా చేస్తే సెట్!
    Credit score increase: బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి. అందువల్ల ఒక వ్యక్తి ఆర్థికారోగ్యం ఎలా ఉందో క్రెడిట్ స్కోరు చెప్పేస్తుంది. మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి రుణాలు సులభంగా లభిస్తాయి. అయితే మీ క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జాన్వీ కపూర్​ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసిన స్టార్​ హీరో.. ధర ఎంతంటే?
    బాలీవుడ్​ హీరో రాజ్‌కుమార్ రావ్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇల్లు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్​దే అట. ఇంతకీ దాని ఖరీదు ఎంతంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.