TOP NEWS: ప్రధాన వార్తలు@7PM
Published on: Jul 30, 2022, 7:00 PM IST

TOP NEWS: ప్రధాన వార్తలు@7PM
Published on: Jul 30, 2022, 7:00 PM IST
TOP NEWS: ప్రధాన వార్తలు@7PM
- మరో పెగ్గు..ఇంకో పెగ్గు అన్నట్లుగా బార్లకు కొనసాగుతున్న ఈ-వేలం.. తిరుపతిలో అత్యధికంగా
BAR LICENSE: రాష్ట్రంలో కొత్తగా బార్ల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటకు పలు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. చిన్న పట్టణాల్లోనే రూ.కోటికి పైగా ధరలు పలుకుతున్నాయి. అత్యధికంగా తిరుపతిలో రూ. కోటీ 59 లక్షలకు వేలం పాడి బార్‌ను దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "జే బ్రాండ్స్ పోవాలి.. జగన్ దిగిపోవాలి".. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళల నిరసన
TDP WOMENS PROTEST: మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్...కల్తీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలుగు మహిళలు ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. జే బ్రాండ్స్ పోవాలి.. జగన్ దిగిపోవాలి అనే నినాదాలు చేస్తూ వినూత్న నిరసనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "మధ్యనిషేధమా"?.. మా మ్యానిఫెస్టోలో లేదు: మంత్రి అమర్నాథ్
MINISTER AMARNATH: మద్యపాన నిషేధంపై మంత్రి అమర్నాథ్ వింత వివరణ ఇచ్చారు. మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అనే మాటే లేదని.. మద్యం ధరను ఫైవ్‌స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని మాత్రమే చెప్పామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు
MURDER: సమాజంలో రోజురోజుకి మానవ సంబంధాలకు విలువలేకుండా పోతోంది. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని కోపం పెంచుకుని వారిని హతమారుస్తున్నారు. పున్నామా నరకం నుంచి రక్షించాల్సిన కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి చంపుతున్నారు. తాజాగా మానసిక స్థితి సరిగాలేని ఓ కుమారుడు తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ట్రాన్స్‌జెండర్‌తో యువతి పెళ్లి.. బంధువుల షాక్ ట్రీట్మెంట్.. హైకోర్టు జోక్యంతో..
ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్నందుకు ఓ యువతికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చిత్ర హింసలకు గురి చేశారు ఆమె బంధువులు. ఆమె భాగస్వామి హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సరైన దిశలోనే డ్రగ్స్‌పై పోరు.. అప్పటివరకు తగ్గేదేలే'
Drugs Amit Shah: దేశంలో ఇటీవల పట్టుబడిన 31 వేల కిలోల మాదకద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగింది. మాదకద్రవ్యాలు చెద పురుగులా మారి యువతను తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన అమిత్ షా.. డ్రగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రిషికి ఇక కష్టమే.. 10శాతానికి పడిపోయిన విజయావకాశాలు
UK PRESIDENT SURVEY: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్ విజయావకాశాలు 10శాతానికి పడిపోయాయి. ఆయనతో పాటు పోటీలో ఉన్న మరో అభ్యర్థి లిజ్ ట్రస్‌కు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముదురుతున్న వివాదం.. ట్విట్టర్‌పై ఎలాన్ మస్క్ కౌంటర్ దావా
Elon musk twitter deal: టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య వివాదం ముదురింది. ట్విట్టర్‌తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి ఎలాన్ మస్క్‌పై కొన్ని రోజుల క్రితం దావా వేసింది. తాజాగా ట్విట్టర్ దావాను సవాలు చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ బోణీ.. వెయిట్ లిఫ్టింగ్‌లో రెండు పతకాలు.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి!
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కామెన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణి కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఏకంగా రెండు పతకాల్ని సాధించింది. 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పతకం అందుకోగా.. 61కేజీలో విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కనులారా వీక్షిద్దాం'.. రణ్వీర్ న్యూడ్ ఫొటో షూట్‌పై బాలీవుడ్ నటి కామెంట్స్
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, విద్యాబాలన్ స్పందించారు. ఈ విషయంలో అతనికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లు చేశారు ఈ హీరోయిన్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Loading...