TOP NEWS: ప్రధాన వార్తలు@1PM

author img

By

Published : Jun 21, 2022, 12:58 PM IST

TOP NEWS

..

  • BEAR ATTACK: ఉద్దానంలో భల్లూకం బీభత్సం.. ఏడుగురిపై దాడి
    BEAR ATTACK: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం ఎలుగు బంటిదాడులతో వణికిపోతోంది. జీడిమామిడి తోటల్లో సంచరిస్తూ.. భల్లూకాలు చేస్తున్న దాడులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే.. ఏడుగురిపై దాడి చేయగా..ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎలుగుబంటి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • HIGH COURT: ఏపీపీఎస్సీలో నియామకాలపై కౌంటర్‌కు హైకోర్టు ఆదేశం
    HIGH COURT: ఏపీపీఎస్సీ అధికారపార్టీ వైకాపాకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, ఛైర్మన్‌, సభ్యుల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ జవాన్లు కాలేమనే.. సికింద్రాబాద్​ విధ్వంసం..!
    Agnipath Protest: అగ్నిపథ్‌ అమల్లోకి వస్తే ఏజ్‌బార్‌ అవుతుందని.... ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తాము ఆర్మీ జవాన్లు కాలేమనే ఉద్దేశంతో.... తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారని రైల్వే పోలీసులు తెలిపారు. బిహార్‌లాగా రైళ్లను తగలబెడదామని కుట్రకు తెరతీశారని.. అందుకు డిఫెన్స్‌ అకాడమీలు సహకరించాయని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆవుల సుబ్బారావు సహా డిఫెన్స్‌ అకాడమీలపై పాత్రపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ELEPHANTS: శ్రీకాకుళంలో గజరాజుల ఘీంకారం...
    ELEPHANTS: ఓ వైపు గజరాజుల ఘీంకారం.. మరోవైపు భల్లూకాల రక్తదాహం.. వెరసి సిక్కోలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.. దాడులకు తెగబడుతూ మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి.. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏళ్ల తరబడి ఇదే దుస్థితి.. ఇదే భయం.. ఏనుగులతో ఏజెన్సీ, ఎలుగుబంట్లతో ఉద్దానం ప్రాంత వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పొలాల్లోకి వెళ్లాలంటే ఎటు నుంచి ఏదొచ్చి దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీఎంసీ నుంచి బయటకు యశ్వంత్​ సిన్హా.. అదే కారణమా?
    Yashwant Sinha: తృణమూల్​ కాంగ్రెస్​ నేత యశ్వంత్​ సిన్హా.. ఆ పార్టీ నుంచి బయటకు రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఈయన పేరు తెరపైకి వచ్చిన తరుణంలో ఆయన స్వయంగా ట్వీట్​ చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం.. విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన సమయం తప్పనిసరి అని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బంగాల్​ సీఎం మమతా బెనర్జీకి కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎస్సై హత్యకు బదులు తీర్చుకున్న సైన్యం.. ముగ్గురు ముష్కరులు హతం
    Encounter at Pulwama: జమ్ముకశ్మీర్​లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో జరిగిన ఎన్​కౌంటర్​లో తాజాగా ఎస్సైని హత్య చేసిన.. ముష్కరుణ్ని పోలీసులు మట్టుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మధ్యంతర దశలో క్షిపణి కూల్చివేత.. చైనా కీలక ప్రయోగం విజయవంతం
    China missile interception test: మధ్యంతర దశలో (మిడ్‌కోర్స్‌) అస్త్రాన్ని నేలకూల్చే యాంటీబాలిస్టిక్‌ క్షిపణి (ఏబీఎం)కి సంబంధించిన సాంకేతిక పరీక్షను చైనా విజయవంతంగా నిర్వహించింది. ఇది పూర్తిగా రక్షణాత్మక చర్య అని, ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది కాదని చైనా రక్షణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?
    Gold Price Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.52,590గా ఉంది. కిలో వెండి ధర రూ.62,724గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అశ్విన్​కు కరోనా.. ఇంగ్లాండ్​ టెస్టుకు ఆలస్యంగా పయనం
    Ravichandran Ashwin corona postive: టీమ్ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఆలస్యంగా బయలుదేరనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆమెతో చైతూ డేటింగ్!'.. 'ఎదగండి అబ్బాయిలూ..' అంటూ సమంత ట్వీట్
    Samantha counter on netizens: హీరోయిన్​ సమంత.. తనను ట్రోల్​ చేసేవారికి గట్టి సమాధానమిచ్చింది. తనను విమర్శించడం మానేసి పని, కుటుంబం మీద దృష్టి పెట్టాలని సమాధానమిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.